బుల్లితెర ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని వెండితెర నటిగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె ప్రేమ విమానం పెద్దకాపు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి అనసూయ మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే గతంలో ఈమెను ఆంటీ అన్న పదం గురించి భారీ స్థాయిలో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఆంటీ అనే పేరుతో అనసూయను భారీ స్థాయిలో ట్రోల్ చేయడంతో ఏకంగా ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ ఆంటీ అనే పదం తనకు ఎందుకు నచ్చదు అనే విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మాట్లాడుతూ నాకు ఆంటీ అనే పదం నచ్చదు నేను కూడా వేరే వాళ్ళని పిలుస్తాను అయితే వారికి అభ్యంతరం అని తెలిస్తే వారిని నేను అలా పిలవను.
సోషల్ మీడియా వేదికగా నేను ఏదైనా ఒక పోస్ట్ చేస్తే ఇప్పుడు ఇలాంటివన్నీ మీకు అవసరమా ఆంటీ పిల్లలను చూసుకోకుండా అంటూ కామెంట్ చేస్తారు చిన్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే ముద్దుగా ఉంటుంది కానీ నాతో పాటు సమానంగా వయస్సు ఉన్నటువంటి వారు ఆంటీ అని పిలిస్తే మరో అర్థం వస్తుందని ఈమె వెల్లడించారు. ఆంటీ అనే పదం నచ్చదు అని చెప్పినప్పటికీ పదే పదే అదే పేరుతో పిలుస్తున్నారని ఈమె తెలిపారు.
నన్ను ఆంటీ అని పిలిచిన వారు ఎలా ఉంటారో నాకు తెలియదు ఈ జన్మకు వారిని కలుస్తానో లేదో నాకు తెలియదు. ఇలా తెలియని, కలవని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతూ బాధ పెడుతున్నారంటే మీ పక్కింటి ఆడవాళ్ళ గురించి మీరు ఎలా మాట్లాడుతారు వారిని ఏ ఉద్దేశంతో చూస్తారో అర్థం చేసుకోవచ్చు ఇలా మాట్లాడే వారందరూ కూడా నా దృష్టిలో రేపిస్టులతో సమానం అంటూ ఈ సందర్భంగా ఈమె (Anasuya) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!