అందరి నోళ్ళు మూయించిన అనసూయ…

  • August 19, 2017 / 01:24 PM IST

“నేనెలా బట్టలు వేసుకోవాలి అనేది నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి. నీకు అంత ఇబ్బందిగా ఉంటే షో ఫ్యామిలీతో కలిసి చూడడం మానేయ్. అంతే కానీ నాకు నీతులు చెప్పడానికి ప్రయత్నించకు” అంటూ ఓ వ్యక్తి తన డ్రెస్సింగ్ పై చేసిన అసభ్య వ్యాఖ్యలపై కాస్త ఘాటుగా స్పందించింది హాట్ యాంకర్ అనసూయ.

మొన్న ప్రసారమైన “జబర్డస్త్” షో కోసం అనసూయ ధరించిన ట్రాన్స్ పరెంట్ బ్లాక్ సారీ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. పెళ్ళయిన అనసూయ ఇలా ట్రాన్స్ పరెంట్ సారీ లో ఎక్స్ ఫోజ్ చేయడం సరికాదని కొందరంటే.. ఇంకొందరేమో ఈవిడకి ఎందుకంత కక్కుర్తి అంటూ విరిచుకుపడ్డారు. అయితే.. వీళ్ళందరికీ అనసూయ తనదైన శైలిలో గట్టిగా సమాధానం ఇచ్చింది. కనీసం ఇప్పట్నుంచైనా తన డ్రెస్ ల గురించి కాకుండా సమాజంలో ఉన్న మరిన్ని సమస్యల గురించి పట్టించుకోండని హితబోధ కూడా చేసింది!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus