Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

సినీ పరిశ్రమ సక్సెస్ చుట్టూ తిరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సక్సెస్ అయ్యేవరకు ఇక్కడి వాళ్ళని ఎవ్వరూ నమ్మరు..పట్టించుకోరు. సక్సెస్ అయ్యాక వాళ్ళని వదలరు. కానీ ఇక్కడ సక్సెస్‌కి ఒక ఫార్ములా అనేది ఉండదు. సక్సెస్ అయిన వాళ్ళని ఆ సీక్రెట్ చెప్పమంటే.. ఏం చెప్పాలో వాళ్లకి అర్థం కూడా కాదు. చాలా మంది సక్సెస్ వచ్చాక చేసేది ఒక్కటే.. జాగ్రత్త పడటం. ఆ జాగ్రత్తలో భాగమే ప్రైవసీ కూడా.

Anil Ravipudi

సక్సెస్‌ఫుల్ మేకర్స్ అంతా ప్రైవసీ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటారు. అంత ఈజీగా వాళ్ళు బయటకి రాలేరు, ఒకప్పటిలా అందరితో కలిసిమెలిసి ఉండలేరు. ఈ క్రమంలో చిన్న సినిమా మేకర్స్ ఎవరైనా తమ సినిమా ఈవెంట్లకి వచ్చి ప్రమోట్ చేయమని అడిగితే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. సాధ్యమైనంత వరకు ‘నో’ చెప్పడానికే ప్రియారిటీ ఇస్తారు. కానీ ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఇలా కాదు.

అతనికి అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉండవు. చిన్న సినిమా, మిడ్ రేంజ్ సినిమా అనే తేడా లేకుండా.. తనని నమ్ముకుని వచ్చిన వారందరికీ తనకి సాధ్యమైన రీతిలో ప్రమోషన్ చేసి పెడతాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయడం, సాంగ్ లాంచ్ చేయడం, లేదంటే ఆయా సినిమాల ఈవెంట్లకి వెళ్లి తన వంతు పుష్ ఇవ్వడం.. ఇలా ఏదో ఒక విధంగా వారికి సాయపడుతుంటాడు. ఇటీవల వచ్చిన ‘తెల్ల కాగితం’ సినిమానే తీసుకోండి.. ఆ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చి అండగా నిలబడ్డాడు.

ఈరోజు రిలీజ్ అయిన ‘ఈఎన్ఈ రిపీట్’లో అయితే ఏకంగా క్యామియో చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇలా స్టార్స్.. చిన్న సినిమాలకి, మిడ్ రేంజ్ సినిమాలకి ప్రమోషన్ విషయంలో సాయం చేయడం వల్ల.. వాటికి కమర్షియల్‌గా చాలా మేలు చేకూరుతుంది. ఆ విధంగా చూసుకుంటే.. అనిల్ రావిపూడి సక్సెస్ చాలా మందికి పనికొస్తుందనే చెప్పాలి.

‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus