Anasuya in Pushpa: ‘పుష్ప’ అనసూయ వెరైటీ రోల్‌ లుక్‌ లీక్‌!

  • August 6, 2021 / 07:00 PM IST

బుల్లితెర అందాల భామ అనసూయ… సినిమాల్లోకి వచ్చేసరికి ఎక్కడిలేని వైవిధ్యం చూపిస్తూ ఉంటుంది. అలా ఆమె నుండి వచ్చిన ఓ అద్భుతం ‘రంగమ్మత్త’. దర్శకుడు సుకుమార్‌ ఆమెను అలా మార్చారు. ఆ తర్వాత ప్రేక్షకుల మనసును కొల్లగొట్టారు. అందుకే ఇప్పటికీ అనసూయను చాలామంది రంగమ్మత్త అనే పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి అనసూయ – సుకుమార్‌ కలసి వస్తున్నారు. దీంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే తాజాగా లీక్‌ అయిన సెట్స్‌ పిక్‌తో అవి మరింత పెరిగాయి.

‘పుష్ప’ సినిమా తాజా షెడ్యూల్‌ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. చిత్రబృందమంతా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో లీకు వీరులు కూడా బిజీ అయిపోయారు. సినిమా షూటింగ్‌ జరుగుతుండగా ఫొటో కొట్టేశారు. ఆ తర్వాత దానిని వైరల్‌ చేసేశారు. పైన మీరు చూసిన పిక్‌ కూడా అదే. బాబ్డ్‌ హెయిర్‌తో అనసూయ భలే క్యూట్‌గా ఉంది. ఆ చీర కట్టు కూడా కొత్తగా కనిపిస్తోంది. దీంతో ఫొటో వైరల్‌ అయిపోయింది.

ముందు చెప్పుకున్నట్టు అనసూయలోని వెరైటీ కోణాన్ని ‘రంగమ్మత్త’ చూపించింది. మరి ‘పుష్ప’లో ఏం పేరు పెట్టారో తెలియదు కానీ… గెటప్‌ అయితే భలేగా ఉంది. అన్నట్లు ఈ సినిమా పాత్రల అదిరిపోద్ది రాసిపెట్టుకోండి అంటూ ఇటీవల అనసూయ చెప్పింది. ఈ పిక్‌ చూస్తుంటే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏదన్నా లెక్కల మాస్టారు సుకుమార్‌ లెక్కే వేరు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus