మీకు మాత్రమే చెప్తా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్న అనసూయ

  • November 4, 2019 / 01:32 PM IST

“అర్జున్ రెడ్డి” టైమ్ లో సినిమాలో ఉన్న బూతు మాటలకు ఘాటుగా స్పందిస్తూ సందీప్ రెడ్డి & విజయ్ దేవరకొండలపై టీవీ9 సాక్షిగా నిప్పులు చెరిగిన అనసూయ.. అనంతరం అంతా చల్లబడ్డాక విజయ్ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన “మీకు మాత్రమే చెప్తా” చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కమర్షియల్ గా వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి.

అయితే.. విడుదలకు ముందు సినిమాను భీభత్సంగా ప్రమోట్ చేసిన అనసూయ, విడుదల తర్వాత మాత్రం పట్టించుకోవడం మానేసింది. విడుదలకు ముందు సినిమాలో హీరోయిన్ అనసూయ ఏమో అని ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అయ్యే రేంజ్ లో ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయ.. ఇప్పుడు కనీసం ప్రమోషనల్ ఈవెంట్స్ కి హాజరవ్వడం కూడా మానేసింది. దాంతో.. విడుదలయ్యాక అనసూయ పోషించిన పాత్రకు పాజిటివ్ రివ్యూలు కానీ, జనాల నుండి సరైన ఆదరణ కానీ లేకపోవడమే అనసూయ ఎవాయిడ్ చేయడానికి కారణం అని తెలిసింది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus