విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘కల్ట్'(Cult) సినిమా నిన్న విడుదలైంది. ‘ఆదర్శ కుటుంబం’ వంటి పెద్ద సినిమాకు పోటీగా విడుదల కావడం వల్ల ఎక్కువ శాతం ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు. కానీ విశ్వక్ సేన్‌కు ఉండే ఆడియన్స్ ఆయనకు ఉన్నారు. వాళ్ల సందడి థియేటర్లలో కనిపించింది. పూర్తిగా యాక్షన్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని తీసిన రా అండ్ వయొలెంట్ సినిమా ఇది. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించడం కూడా జరిగింది.
‘తారక్ సినిమాస్’ బ్యానర్‌పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడుతుందా? రెండో రోజు నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకునే అవకాశం ఉందా? అంటూ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే:
మైనస్ పాయింట్స్
‘కల్ట్’ సినిమాపై మొదటి నుండి హైప్ లేదు. ఎందుకంటే ప్రమోషనల్ కంటెంట్‌లో విపరీతమైన వయొలెన్స్ ఉంది. వయొలెన్స్ అనేది పెద్ద అడ్డుకట్ట కాకపోయినా, ఇందులో చాలా డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి. మెజారిటీ ఆడియన్స్ దానిని ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.
విశ్వక్ సేన్ కూడా ఈ మధ్య ఫామ్‌లో లేడు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’, ‘ఫంకీ’ వంటి సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో ‘కల్ట్’పై మొదటి నుండి బజ్ లేదు. అందుకే ట్రేడ్ సర్కిల్స్‌లో కూడా రిలీజ్‌కు ముందు ఈ సినిమా పెద్దగా సౌండ్ చేయలేదు.
కంటెంట్ విషయంలో చూసుకున్నా కూడా కల్ట్ అంతంత మాత్రమే. సినిమా ఓపెనింగ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. దాదాపు ఒక 20, 30 నిమిషాల వరకు పబ్‌కు వెళ్లిన ఫీలింగ్ ఇస్తుంది. అంతేతప్ప తెరపై ఆసక్తికర సన్నివేశాలు ఏమీ కనిపించవు.
హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ కూడా చాలా ఆలస్యంగా ఉంటుంది. దాదాపు ఇంటర్వెల్‌కు ముందు విశ్వక్ ఎంట్రీ ఇస్తాడు. అప్పటివరకు దారుణమైన విజువల్స్ వస్తాయి. అలా బ్యాక్ టు బ్యాక్ వచ్చే హింసాత్మక సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి.
విశ్వక్ ఎంట్రీ తర్వాత కూడా కథనం ముందుకు సాగదు. అతనొక ఫైట్ చేస్తాడు, తర్వాత మళ్లీ గేమ్, ఆ తర్వాత మళ్లీ ఫైట్.. ఇలాగే కథనం సాగుతుంది.
సినిమా మొత్తం గోవాలో, ఒక పబ్ సెట్లో తీసేశారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్, తరుణ్ భాస్కర్ డైలాగుల కోసం తప్ప లొకేషన్స్ కోసం ఖర్చు పెట్టింది ఏమీ లేదు. సినిమాలో విశ్వక్ సేన్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తప్ప తెలిసిన ముఖాలు ఎక్కువగా ఏమీ లేవు.
రూ.25 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమీ కనిపించలేదు.
పాజిటివ్ పాయింట్స్
క్లైమాక్స్‌లో విలన్ ట్రాక్‌ను రివీల్ చేసిన విధానం, అతని బ్యాక్ స్టోరీ బాగున్నాయి. ఆ నటుడు జనాలకు పెద్దగా తెలియకపోయినా.. దానిని ఒక ట్విస్ట్ మాదిరి కాకుండా, ఎమోషనల్ కోటింగ్ ఇచ్చి ఒపీనియన్ షిఫ్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు.
తరుణ్ భాస్కర్ డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీశర్మల మధ్య జరిగే సంభాషణలు ఎంజాయ్ చేయొచ్చు.
రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో రవి బస్రూర్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది.
మొత్తంగా ‘కల్ట్’లో అలరించే అంశాలు తక్కువ. యాక్షన్ సినిమాలు, ముఖ్యంగా సైకలాజికల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా పర్వాలేదు అనిపించొచ్చు. అయినప్పటికీ ఈ కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వడం కష్టమే.