అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే తాజాగా అనసూయ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దకాపు 1 సినిమా ద్వారా సందడి చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఒక గ్రామీణ ప్రాంతంలో కుల మతాల మధ్య చెలరేగిన రాజకీయాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచేసాయి కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అనసూయ అక్కమ్మ అనే కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర పై ఈమె కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడం పట్ల తాజాగా (Anasuya) అనసూయ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెదకాపు సినిమా పూర్తిగా శ్రీకాంత్ అడ్డాల మార్క్ అని ఈమె తెలిపారు. అయితే కొన్ని ఆ సార్లు మన అంచనాలు తప్పు అవుతాయని ఈమె తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నా పాత్ర పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ అవడంలో మిస్సయిందనే భావన తనకు కూడా ఉందని తెలియజేశారు.
అయితే తాను నటించిన కొన్ని సన్నివేశాలను కట్ చేయడం వల్లే ఇలా కథతో కనెక్షన్ తప్పిపోయిందని అందులో నా తప్పు ఏమాత్రం లేదు అంటూ అనసూయ తెలియచేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాలతో అనసూయకు విభేదాలు అంటూ వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ శ్రీకాంత్ గారితో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు అంటూ ఈ సందర్భంగా అనసూయ క్లారిటీ ఇచ్చారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!