స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా కానీ.. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటుంది.. ఫ్యాన్స్, నెటిజన్లతో మంచికి మంచి.. పంచ్‌కి పంచ్ అన్నట్టుంటుందామె.. ఆప్యాయంగా అక్కా అని పిలిస్తే ప్రేమగా బదులిస్తుంది.. తిక్క తిక్క వేషాలేస్తే తాట తీస్తుంది.. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది.. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా ముఖం మీద చెప్పెయ్యడం అనసూయకి అలవాటు..
ఇద్దరు పిల్లల తల్లి అయినా కానీ చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తూ.. యంగ్ యాంకర్స్, యాక్ట్రెసెస్‌కి సవాలు విసురుతుంటుంది అనసూయ.. ఇక ఎవరైనా వల్గర్ కామెంట్స్ చేస్తే మామూలుగా ఫైర్ అవదు.. ఇటీవల వాలంటైన్స్ డే నాడు తన భర్తతో ఉన్న పిక్ షేర్ చేయగా.. నెగిటివ్ కామెంట్ చేసిన ఓ వ్యక్తిని ఉతికి ఆరేసింది.. అలాగే టాపిక్ ఏదైనా తన స్టైల్లో స్పందిస్తుంటుంది.. ఇప్పుడు కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది అను..
తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ‘గే’ లు ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. అనసూయ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో నెటిజన్లతో కాసేపు ముచ్చటించింది.. వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహికుడు.. ‘‘మీరు నిజంగా లిబరల్, మెచ్యూర్డ్ వుమెన్ అయితే నాకు సమాధానం చెప్పండి.. మీకెప్పుడైనా లెస్బియన్స్‌తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా?’’ అని అడిగాడు.. సాధారణంగా ఈ ప్రశ్నకి ఎవరికైనా చిరాకొస్తుంది.. లేడీస్‌ని పట్టుకుని ఏం అడుగుతున్నావ్..
బుద్ది లేదా? అని కసురుకుంటారు.. క్వశ్చన్ స్కిప్ చేస్తారు.. కానీ అక్కడుంది ఎవరు.. అనసూయ.. ఏమాత్రం తడుముకోకుండా వెంటనే ఆన్సర్ ఇచ్చేసింది.. ‘‘మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ‘గే’ లు ఉన్నారు.. లెస్బియన్స్‌తో నాకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ కాలేదు కానీ.. ఆన్‌లైన్‌లో మాత్రం చాలాసార్లు అనుభవమైంది’’ అని బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చింది.. దీంతో అడిగిన వ్యక్తికి.. చదివిన వారికి దిమ్మ తిరిగింది.. ‘‘‘అనసూయ అంటే అంతే మరి.. మామూలుగా ఉండదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?