వైరల్ అవుతున్న అనసూయ చిట్టి నడుము డ్యాన్స్..!

  • December 9, 2019 / 04:44 PM IST

బుల్లితెర ప్రేక్షకులని ఎలా అలరించాలో.. ఎక్కువగా ఫిమేల్ యాంకర్స్ కు బాగా తెలుస్తుంది అనడంలో సందేహం లేదు. యాంకర్ సుమ తనదైన పంచ్ డైలాగులతో బాగా ఆకట్టుకుంటుంది. ఇక మరో స్టార్ యాంకర్ అనసూయ తన గ్లామర్ తో కుర్ర కారుని నిద్ర లేకుండా చేస్తుంటుంది అనడంలో సందేహం లేదు. మూడు పదుల వయసు దాటినా.. పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ.. తన నైపుణ్యంతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. తనకి సూటయ్యే క్యారెక్టర్లు ఎంచుకుని సినిమాలు చేస్తూనే.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పరుచుకుంది.

ఇక ప్రస్తుతం అనసూయ ‘జబర్దస్త్’ షో కు యాంకర్ గా చేస్తూనే… ‘జీ తెలుగు’ లో టెలికాస్ట్ అవ్వబోతున్న ‘లోకల్ గ్యాంగ్స్’ అనే షో లో జడ్జిగా వ్యవహరించడానికి రెడీ అవుతుంది. ఇక తాజా ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ఒకటి విడుదల కాగా… అందులో మన రంగమ్మత్త చిట్టి నడుముతో చితక్కొట్టేసింది. మరో జడ్జ్ జానీ మాస్టర్ తో కలిసి ‘చిట్టి నడుమునే చూస్తున్నా’ అనే పాటకి తన నడుము చూపిస్తూ డ్యాన్స్ చేసి అందరినీ ఆకర్షిస్తుంది.ఈ ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ కు టి.ఆర్.పి ఏ రేంజ్ లో రప్పిస్తుందో చూడాలి.


24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus