‘ఫ్యామిలీ’ పై అనసూయ సంచలన కామెంట్స్

అనసూయ…ఈ భామని యాంకర్ అనాలా, లేక నాటి అనాలా, లేకపోతే హీరోయిన అనాలో తెలీదు కానీ, మొత్తానికైతే ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ పుణ్యమా అంటూ యాంకర్ అనసూయ తెలుగు బుల్లి తెరకు పరిచయం అయ్యింది. ఇక ఆ ప్రోగ్రామ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె బాగా ఫేమస్ అవడంతో అక్కడనుంచి మెల్లగా స్టేజ్ షోస్, ఇవెంట్స్ అంటూ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ సినీ పరిశ్రమకు సైతం షిఫ్ట్ అయ్యింది. అప్పట్లో అడపా..దడపా సినిమాలు చేసిన ఆమె, పెద్దగా కలసి రావడంతో అటువైపు ఆలోచనలు చేయకుండా యాంకరింగ్లోనే సెటిల్ అయిపోగా, తాజాగా నాగ్ తీసిన సోగాడే చిన్ని నాయన సినిమాలో తళుక్కున మెరిసింది.

ఇంకేముంది నాగ్ చెయ్యి పడింది కదా, పంట పండినట్లే. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ‘క్షణం’ అనే చిత్రం లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ అమ్మడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇక వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఈ భామ ఆనందానికి అవదులు లేవు. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ తన ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది, వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలం నుంచి తనపై రూమర్స్ వస్తున్నాయి అని, ఒక నటిగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటివి కామన్ అని అయితే తనపై కామెంట్స్ చేస్తే పెద్దగా పట్టించుకోనని కానీ.. తన ఫ్యామిలీ జోలికి వస్తే తట్టుకోలేక రియాక్ట్ అవుతానని అనసూయ చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా..’క్షణం’లో మెప్పించిన అనసూయ మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఆశిద్దాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus