బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరమైనప్పటికీ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో ఈమె గురించి నేటిజన్స్ ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా అనసూయ నేటిజన్స్ మధ్య ఈ ఆంటీ వివాదం దాదాపు మూడు రోజులపాటు వివాదంగా మారింది.
ఇలా తన గురించి వచ్చినటువంటి ట్రోల్స్ పై ఈమె ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం ముగిసింది అనుకొనేలోపు మరోసారి ఈ విషయం గురించి అనసూయ స్పందించి క్లారిటీ ఇచ్చారు. సరదాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని అక్క మీకు ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తనకు ఆంటీ అంటే కోపం వస్తుంది. ఎందుకంటే వారు పిలిచే పిలుపు వెనుక వేరే అర్థాలు ఉంటాయి అంటూ ఇవే క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం తనకు ఈ విషయంలో కోపం రావడం లేదని తెలిపారు. తాను తన గురించి ట్రోల్ చేసే వారిని చక్కదిద్దడం కంటే తనకు ఇంకా చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయని, ఆ పనులతో తాను బిజీగా ఉండిపోతున్నా అంటూ సమాధానం చెప్పారు.
ఇలా అనసూయ (Anasuya) మరోసారి ఆంటీ వివాదం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బుల్లితెరకు దూరమైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?