Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Advertisement

టాలీవుడ్ సినిమా ఈవెంట్స్ అంటే ఒకప్పుడు కేవలం సుమ పేరే వినిపించేది. కానీ, ఇప్పుడు తనదైన వాక్చాతుర్యం, హుందాతనంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరో స్టార్ యాంకర్ గీతా భగత్. స్టార్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకుండా, సరదాగా మాట్లాడుతూనే క్రేజీ విషయాలను రాబట్టడం ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్న గీత, మొన్నమధ్య నిర్మాతగా కూడా మారి ‘తను రాధే నేను మధు’ అనే ఓటీటీ మూవీని నిర్మించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి హాట్ టాపిక్ అయ్యారు.

Geetha Bhagat

సినిమాల్లో రాణించాలనే కలతో పరిశ్రమకు వచ్చే వారు చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఇక్కడే ఏదో ఒక పనిచేసుకుంటూ ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి అండగా నిలిచేందుకు గీతా భగత్ ‘ఆరెంజ్ కాస్టింగ్’ (Orange Casting) పేరుతో ఒక కాస్టింగ్ ఏజెన్సీని స్థాపించారు. దీనికి సంబంధించిన లోగోను సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు.

తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా గీతా భగత్ స్పందిస్తూ.. “మంచి విషయాలను పంచుకోవడానికి కొంత టైమ్ పట్టొచ్చు కానీ ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆరెంజ్ కాస్టింగ్ ద్వారా మా ప్రయాణం మొదలై ఇప్పటికే కాలం అయ్యింది. అయితే ఇప్పుడు అందరితోనూ పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లను గుర్తించి, వారికి సరైన వేదికను కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం” అంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందు ముందు మరిన్ని సర్ప్రైజింగ్ అప్‌డేట్స్ ఉంటాయని కూడా ఆమె వెల్లడించడం విశేషంగా చెప్పుకోవాలి.

ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus