Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ఈయన తన అద్భుతమైన వాక్యాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు.ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ వెండితెరపై కూడా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. ఇలా వెండితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన ప్రదీప్ కు ఏకంగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం కూడా వచ్చింది.

ఈ సినిమా ద్వారా హీరోగా అందరిని మెప్పించిన ప్రదీప్ తదుపరి ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఈయన మాత్రం బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రదీప్ ఏ కార్యక్రమానికి వెళ్లిన లేదా ఏ ఈవెంట్ల లో పాల్గొన్న తన పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు ప్రస్తావనకు వస్తాయి.ప్రదీప్ పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకో పోవడంతో ఈయన పెళ్లి గురించి తరచూ ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఇదివరకే ఎన్నోసార్లు ఈయన పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ప్రదీప్ పెళ్లి గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి మాత్రం ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయిందని ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వినపడుతోంది. ప్రదీప్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతుతో రిలేషన్ లో ఉన్నారని

ఎట్టకేలకు వీరి విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇలా వీరి ప్రేమ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులకు కూడా వీరి పెళ్లి చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పెళ్లి గురించి చర్చలు కూడా మొదలయ్యాయని త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా తెలియచేయునున్నట్టు సమాచారం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus