హాలీవుడ్.. బాలీవుడ్.. టాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా కుదిపేసిన అంశం ఒకటే. అదే కాస్టింగ్ కౌచ్. గత కొన్నిరోజులుగా ఈ విషయంపై మీడియాలో చర్చ జరుగుతోంది. చర్చ అనేదానికంటే రచ్చ అని చెప్పవచ్చు. ఒక్కొక్క నటి తనకి జరిగిన అనుభవాన్ని చెప్పడం. అది వార్తల్లో హైలెట్ కావడం సర్వసాధారణం అయిపోయాయి. శ్రీ రెడ్డి అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి తలనొప్పిగా మారింది. ఆమెను సమర్ధించినవారు కొందరైతే.. వ్యతిరేకించినవారు మరికొందరు. తాజాగా ఈ విషయంపై నటి, యాంకర్ రష్మీ స్పందించింది. ‘‘అన్ని రంగాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.
కేవలం సినిమా ఇండస్ట్రీనే లక్ష్యంగా చేసుకొని ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేయొద్దు. కాస్టింగ్ కౌచ్ అంటూ కేవలం సినిమా పరిశ్రమని తప్పుగా చూపకండి. ఇక ఇప్పటితో ఈ టాపిక్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసి ఇలాంటి చౌకబారు ఆలోచనలు మానుకోండి’’ అని ట్వీట్ చేసింది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న రష్మీ ఇప్పుడు స్పందించడంతో మళ్ళీ కాస్టింగ్ కౌచ్ వార్తల్లో నిలిచింది. ఆమె ట్వీట్ చేయకుండా ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చేవారు కొందరైతే… హీరోయిన్స్ మాత్రమే ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరి ఇంతటితో కాస్టింగ్ కౌచ్ రచ్చకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.