అవును…తనతో ‘డేటింగ్’ లో ఉన్నా…

  • March 9, 2016 / 09:56 AM IST

అందాల బొమ్మ రేష్మి గుట్టు విప్పేసింది. తనకు తన సహా నటుడికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే బిల్లి తెర హాట్ యాంకర్ రేష్మి ప్రస్తుతం తాను గుంటూర్ టాకీస్ సినిమాలో నటిస్తుంది. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక విలేఖరి గుంటూర్ టాకీస్ సినిమాలో హీరోగా నటించిన సిద్ధూతో క్లోజ్ గా ఉంటున్నారు. ఏంటి సంగతి, కొంప తీసి లవ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? అని అడిగిన పాపానికి సమాధానం చెప్తూ….అవును మేము ప్రేమించుకుంటున్నాం ప్రస్తుతం నేను అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ కుండ బద్దలు కొట్టేసింది.

ఇక మరో పక్క బుల్లి తెరపై తన అందాలను ప్రదర్శించిన రేష్మి తనకు తగిన ప్రాముఖ్యత సినిమాల్లో వస్తుంది అని నమ్మి, తన అదృష్టాన్ని అక్కడ టెస్ట్ చేసుకుంటుంది. ఇక మరో  పక్క రీ ఎంట్రీ సినిమాలో ఎలాగైనా చాన్స్ లు పట్టేయాలని విచ్చలవిడి అందాల ప్రదర్శన చేసిన ఈ అమ్మడు ఒక్క సినిమాలో నటించి అతనితో డేటింగ్ చేయడం అంటే కాస్త నమ్మలేని నిజమే కానీ, నమ్మక తప్పదు. మరి అంతటి అందాల ప్రదర్శన ఈ భామకు ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus