కరోనా భారిన పడ్డ మరో టాలీవుడ్ సెలబ్రిటీ..!

కరోనా విజృంభణ తగ్గిందని అందరూ అనుకుంటున్నప్పటికీ.. సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీలు వరుసగా దీని భారిన పడటం ఆందోళన కలిగించే అంశం. ఈ మధ్యనే తమన్నా, జీవిత రాజశేఖర్, సుడిగాలి సుధీర్ వంటి వారు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాంకర్ రష్మీకి కూడా కరోనా సోకిందని తెలుస్తుంది. ఇటీవల ఆమె షూటింగ్లో పాల్గొన్న ఓ టీవీ షో వల్లనే ఈమె కరోనా భారిన పడినట్టు టాక్. ప్రస్తుతం రష్మీ.. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతుందట.

ఈమె ఇటీవల సుడిగాలి సుధీర్ పాల్గొన్న ఓ షో షూటింగ్లో పాల్గొందని సమాచారం.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సుధీర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతనితో కలిసి షూటింగ్లో ఉన్న వారందరూ టెస్టులు చేయించుకున్నారట. వారిలో రష్మీకి కరోనా అని నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది.

దీంతో శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన‌ ‘జ‌బ‌ర్ద‌స్త్’‌, ‘ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్’ షూటింగ్లను అక్టోబ‌ర్ 28కి వాయిదా వేసారట. అప్పటికీ వీరు కోలుకోలేని పక్షంలో న‌వంబ‌ర్ మొద‌టి వారంలో షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus