బుల్లితెర పై రాణిస్తున్న స్టార్ యాంకర్లలో శ్యామల కూడా ఒకరు. అందం, అభినయం కలిగిన శ్యామలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో నటించిన శ్యామల అటు తరువాత కొన్ని షోలకు యాంకరింగ్ చెయ్యడం మొదలుపెట్టింది.దాంతో ఈమెకు పలు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ‘లౌక్యం’ ‘ఒక లైలా కోసం’ ‘స్పీడున్నోడు’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. తరువాత ‘బిగ్ బాస్’ సీజన్ 2లో కూడా ఈమె కంటెస్టెంట్ గా పాల్గొని తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇదిలా ఉండగా.. సీరియల్ ఆర్టిస్ట్ నరసింహారెడ్డిని ఈమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోపక్క యాంకర్ గా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది శ్యామల. అయితే శ్యామల సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఈమె సొంత ఊరు కాకినాడ. కేవలం అవకాశాల కోసమే హైదరాబాద్ కు వచ్చిందట. ఈమెకు సక్సెస్ అంత ఈజీగా దక్కలేదట. అవకాశాల కోసం ఈమె కూడా చాలా అవస్థలు పడిందట. గతంలో శ్యామలకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్యామలనే ఈ విషయాలను చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ… ‘ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టాలు పడ్డాను. మాది హైదరాబాద్ కాదు .. అవకాశాల కోసమే ఇక్కడికి వచ్చాను. కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ లో కూడా నటించేదాన్ని. ఆ టైములో ఓ పేరున్న కెమెరామెన్ నన్ను వేధింపులకు గురిచేశాడు. శారీరకంగా లొంగదీసుకోవాలని చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతను చెప్పినట్టు కనుక వినకపోతే అవకాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. కానీ నేను ఈ విషయాన్ని ఆ సీరియల్ దర్శక నిర్మాతలకు చెప్పాను. అప్పటి నుండీ నాకు వేధింపులు తక్కువయ్యాయి” అంటూ చెప్పుకొచ్చింది శ్యామల.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!