Anchor Shyamala: కొత్త ఇంటి నిర్మాణానికి సిద్ధమైన శ్యామల.. అంత డబ్బు ఎక్కడిదంటూ కామెంట్స్!

  • March 4, 2023 / 05:18 PM IST

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ మొదట్లో పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈమె అనంతరం వెండి తెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే యాంకర్ గా స్థిరపడిన తర్వాత ఈమె బుల్లితెరపై సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు.

యాంకరింగ్ విషయంలో సుమా తర్వాత అంతటి క్రేజ్ ఉన్నటువంటి ఈమె అదే పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఈమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు.

ఇలా నిత్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేసే ఈమె గత ఏడాది జులై నెలలో తాను కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్లు తెలియజేస్తూ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోలను ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా శ్యామల తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవడంతో అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్యామల తాజాగా తన మరో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

ఇందులో తన భర్త కుమారుడితో పాటు ఈమె ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శ్యామల భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నేటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయగా మరి కొందరు మాత్రం కొత్త ఇల్లు కట్టి ఏడాది కూడా కాకుండానే మరో కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయడమా… ఇది ఎలా సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విధంగా ఏడాది కూడా కాకుండానే కొత్త ఇంటి నిర్మాణానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది శ్యామల గారు, ప్రస్తుతం మీరు ఎలాంటి షోలను కూడా చేయలేదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ఇల్లు అంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకొని ఉంటుంది.అలాంటిది ఏడాదిలోపే శ్యామల కొత్త ఇంటిని నిర్మించి మరో కొత్త ఇంటికి భూమి పూజ చేయడంతో ఈ ఫోటోలపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై శ్యామల స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus