Sravanthi Chokarapu: స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న స్రవంతి… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu) పరిచయం అవసరం లేని పేరు..ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకి చెందిన కదిరికి చెందిన అమ్మాయి స్రవంతి. 2009లో చదువు పూర్తి చేసి మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది స్రవంతి. టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. టీవీ ప్రోగ్రాంలలో మెరుస్తూనే, సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఇంటర్వ్యూలను చేయడంతో ఈ భామ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

రాయలసీమ యాసలో ‘పుష్ప’ (Pushpa) టీమ్ తో ఈమె చేసిన ఇంటర్వ్యూలో బాగా ఫేమస్ అయింది. ఇకపోతే ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్లో ఈమె ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో స్రవంతి గేమ్ ఆడిన తీరు కూడా అందరికీ నచ్చింది. అలానే సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. స్రవంతి తన గ్లామర్ మెయింటైన్ చేయడంలో అసలు తగ్గదు. ఇక తాజాగా కలర్ ఫుల్ డ్రెస్‌ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ లో చిల్ అవుతుంది స్రవంతి చొక్కారపు. తడిచిన శరీరంతో తన సొగసులు చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తుంది.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus