Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా పీరియాడిక్ మూవీ రూపొందింది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్ర పోషించారు. మహేష్ బాబు పి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు.

Andhra King Taluka

వారి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక టీజర్, ట్రైలర్స్ వంటివి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మొదటి రోజు సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి.వీకెండ్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది ఈ సినిమా.

50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయింది. వీక్ డేస్ లో మరింతగా డ్రాప్ అయ్యింది.మొదటి సోమవారం కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేదు. మంగళవారం అయితే దానికి సగానికి సగం పడిపోయాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.91 cr
సీడెడ్ 0.70 cr
ఆంధ్ర(టోటల్) 4.41 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 10.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.10 cr
ఓవర్సీస్ 2.21 cr
టోటల్ వరల్డ్ వైడ్ 13.33 కోట్లు(షేర్)

‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రానికి రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.25.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.13.33 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.12.17 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరో 2 రోజుల్లో ‘అఖండ 2’ రాబోతోంది. ఆ సినిమాతో పోటీపడి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus