శ్రీరెడ్డి పోరాటం గురించి సంచలన కామెంట్ చేసిన ఆండ్రియా!

నటి శ్రీరెడ్డి.. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో వివాదాస్పద నటిగా మారింది. టాలీవుడ్ లో ప్రముఖులపై వివాదాస్పద ఆరోపణలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఆమెకు కొంతమంది మద్దతు నిలవగా.. మరికొంతమంది ఆమె తీరును ప్రశ్నించారు. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ప్రముఖులపైనా శ్రీరెడ్డి ఆరోపణలు చేసి అక్కడ కూడా బాగానే పాపులర్ అయింది. అందుకే ఏ నటి ఇంటర్వ్యూ కూ హాజరైనా.. క్యాస్టింగ్ కౌచ్, శ్రీరెడ్డి గురించి ప్రస్తావిస్తున్నారు.  తాజాగా ఆండ్రియాని అడగగా ఆమె సంచలన కామెంట్స్ చేసింది. మొదట గాయనిగా ఎంట్రీ ఇచ్చిన ఆండ్రియా తర్వాత హీరోయిన్ గా ఎదిగింది.

పచ్చైక్కిళి ముత్తుచ్చారం, అయిరత్తిల్ ఒరువన్,  విశ్వరూపం, తరామణి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా కమల్ హాసన్ తీసిన ‘విశ్వరూపం2’లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా నటి శ్రీరెడ్డి గురించే అడుగుతున్నారు.. ఆమె చెప్పేదంతా నిజమైతే అలా బయటికి చూపించడానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే లైంగిక ఒత్తిడి ఎదురుకాలేదు.   అలాంటివి జరిగితే ధైర్యంగా బయటపెట్టడమే మంచిది. సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ప్రేరేపించేవారిని కఠినంగా శిక్షించాలి” అంటూ శ్రీరెడ్డి పోరాటానికి ఆమె మద్దతు తెలిపింది. ఇక తనకు ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏమీ లేదని  స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus