హిట్ కాంబో రిపీట్ కానుందా..?

పాండమిక్ సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. చాలా మంది హీరోలు, దర్శకనిర్మాతల ప్రాజెక్ట్స్ పై క్లారిటీ లేకుండా పోయింది. కొందరు దర్శకులు.. స్టార్ హీరోలు, యంగ్ హీరోల కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ లాక్ డౌన్ లో దర్శకుడు అనీల్ రావిపూడి సినిమాల కోసం స్క్రిప్ట్ లు రాసుకున్నాడట. ఈ క్రమంలో మాస్ మాహారాజా రవితేజ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘రాజా ది గ్రేట్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకోవడంతో మరోసారి అనీల్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు రవితేజ. అయితే వీరి కాంబినేషన్ లో రాబోయే తదుపరి సినిమా ‘రాజా ది గ్రేట్’ చిత్రానికి సీక్వెలా..? లేక కొత్త కథా..? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ అనీల్ రాసుకున్న కథ మాత్రం రవితేజకి నచ్చిందట. నిర్మాత సాహు గారపాటి.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనీల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా కోసం పని చేస్తున్నాడు. ‘ఎఫ్2’ సినిమాకి కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాలో వెంకీ, వరుణ్ లతో పాటు మరో హీరో కూడా కనిపించనున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇది పూర్తవ్వగానే రవితేజ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్తారట!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus