Anil Ravipudi: బాలయ్యతో పవర్ ఫుల్ మాస్ ఎంటెర్టైనర్!

Advertisement

వరుస విజయాలతో టాలీవుడ్ తో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అనీల్ రావిపూడి. గతేడాది మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తీసి తన పాపులారిటీ మరింత పెంచుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాను తెరకెక్కిస్తోన్న అనీల్ రావిపూడి తన తదుపరి సినిమా మహేష్ తో తీయాలనుకున్నాడు. మహేష్ కూడా ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించాడు. కానీ సడెన్ గా లైన్ లోకి త్రివిక్రమ్ రావడంతో అనీల్ ప్లాన్ పై ఎఫెక్ట్ పడింది. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే.. రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతాడు మహేష్. ఇప్పట్లో ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం.

అందుకే అనీల్ రావిపూడి తన తదుపరి సినిమా కోసం హీరోని వెతుకుతున్నాడు. చాలా కాలంగా అనీల్ రావిపూడికి బాలకృష్ణతో సినిమా చేయాలని కోరిక. గతంలో ఆయనకు ‘రామారావు’ అనే సినిమా స్టోరీ కూడా చెప్పారు. కానీ కుదరలేదు. అయితే ఈసారి ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అని చెబుతున్నారు. బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటెర్టైనర్ కథను సిద్ధం చేసుకున్న అనీల్ రావిపూడి ఇటీవల ఆయన్ని కలిసి నేరేషన్ ఇచ్చాడట. అనీల్ రావిపూడి నేరేషన్ తో ఇంప్రెస్ అయిన బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తరువాత గోపీచంద్ మలినేని సినిమా మొదలుపెట్టనున్నారు. ఆ తరువాత అనీల్ రావిపూడితో సినిమా ఉంటుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus