అపజయమెరుగని దర్శకుడు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పటి వరకూ ఆయన తీసిన 11 సినిమాల్లో ఏ ఒక్కటి ఫెయిల్యూర్ అవ్వలేదు. అలా అని ఆయన ఎప్పుడు మరో ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా చేయలేదు. కేవలం తెలుగు సినిమాతోనే ఇండియా మొత్తం తెలుగు సినిమా గురించి గర్వంగా మాట్లాడేలా చేసాడు. ఈ దర్శకదీరుడు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా అందరూ రెడీ అనేలా చేసాడు. ఇక ఈయన వరుసగా సక్సెస్ లు అందుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఏంటి అని చాలా మంది డైరెక్టర్లు ఎంతో ఎనాలసిస్ చేశారు.
కానీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. చివరికి మహేష్ బాబు డైరెక్టర్ ఆ సక్సెస్ ఫార్ములాని ట్రాక్ చేసేసాడట. ఆ విషయాన్ని తాజాగా ఆయన చెప్పుకొచ్చాడు. ‘రాజమౌళి గారు తీసిన సినిమాల్లో ఏ ఒక్కటి మిస్ కాకుండా అన్ని ఎలా హిట్ కొడుతున్నారు? అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన బలాన్ని ఎప్పుడూ వదిలిపెట్టి సినిమా చేయలేదు. ఆయన బలం ‘ఎమోషన్’. దాని చుట్టూనే ఆయన సినిమా ఉంటుంది. ‘ఈగ’ అయినా ‘బాహుబలి’ లాంటి ఫాంటసీ అయినా.. ఆయన తన బలమైన ఎమోషన్ ను మిస్ కాకుండా చూసుకున్నాడు. అందుకే ఎప్పుడూ సక్సెస్ ఆయన వెంటే వస్తుంది. అందుకే.. మన బలాన్ని ఎప్పుడూ వదలకూడదు. అప్పుడు సినిమా మిస్ ఫైర్ అయ్యే అవకాశం తక్కువ.. అందుకే కథ రాసుకునే దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తన సినిమాలు వరుస పెట్టి సక్సెస్ అవుతున్నాయి.” అంటూ చెప్పుకొచ్చాడు.
“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!