Anil Ravipudi: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అనిల్‌ ఇప్పుడు కారు ఇవ్వాల్సిందేనా?

టాలీవుడ్‌ అనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా విజయం సాధిస్తే.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడితే ఆ సినిమా దర్శకుడికి ఓ గిఫ్ట్‌ వస్తుంటుంది. కొంతమంది కారు గిఫ్ట్‌గా అందుకుంటే, మరికొంతమంది వాచ్‌లు లాంటివి అందుకున్నారు. గతంలో ఇలానే దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇలానే ఓసారి కారు అందుకున్నారు కూడా. ఇప్పుడు మరోసారి ఆయనకు కారు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ డిస్కషన్‌ గురించి తెలిస్తే అనిలే ఇప్పుడు కారు ఇవ్వాల్సి వస్తుంది.

Anil Ravipudi

చిరంజీవి సీనియర్‌ ఫ్యాన్స్‌ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న సినిమా.. యంగ్‌ ఫ్యాన్స్‌ బాస్ టాలెంట్‌ని విట్‌నెస్‌ చేసిన సినిమా ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’. సినిమా చూస్తున్నంతసేపు ఫ్యాన్స్‌ ఈలలు గోలలు చూస్తే నాటి రోజులు గుర్తొచ్చాయి. అంతటి విజయాన్ని అందించారు అనిల్‌ రావిపూడి. ఈ విజయం ఆయన, నిర్మాతలతోపాటు ఫ్యాన్స్‌ కూడా ముందే ఊహించారు. అయితే ఓవర్సీస్‌లోనూ భారీ విజయం దక్కుతుందని అనిల్ ముందు ఊహించినట్లు లేరు. అందుకే బెట్‌ కట్టి ఓడిపోయారు.

సినిమాకు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తో 1.2 మిలియన్‌ డాలర్ల వసూళ్లు వచ్చాయి. అదే ఇప్పుడు అనిల్‌ బెట్‌ ఓడిపోవడానికి కారణం. ఇంతకుముందు ‘భగవంత్ కేసరి’ సినిమా హిట్టవడంతో అనిల్‌కు సాహు ఓ కారు ఇచ్చారు. మరి చిరు సినిమాకు అలాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఈసారి రివర్స్‌లో ఆయనే కారు ఇస్తారు అని చెప్పారు సాహు. కారణమేంటి అని అడిగితే యుఎస్‌లో ప్రీమియర్స్‌తో మిలియన్ మార్కు అందుకుంటే కారు ఇస్తానని అనిల్ (Anil Ravipudi) ఛాలెంజ్ చేశారట. అదన్నమాట మేటర్‌.

ఇక ఈ సినిమా తొలి రోజు + స్పెషల్‌ ప్రీమియర్ల వసూళ్లు కలిపి మొత్తంగా రూ.84 కోట్లు వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమాకు రూ.120 కోట్ల బిజినెస్‌ జరిగింది అని టాక్‌. ఈ లెక్కన సంక్రాంతి అయ్యేసరికి ఆ వసూళ్ల లెక్క భారీగానే ఉంటుంది అని చెప్పొచ్చు. రెండో రోజు వసూళ్లు బట్టి ఈ విషయం తేలుతుంది.

 ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus