F3 మూవీలో మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫాదర్..?

  • January 30, 2021 / 03:37 PM IST

వరుణ్ తేజ్ – వెంకటేష్ రెండోసారి కలిసి నటిస్తున్న F3 సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీపై కూడా మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఆగస్ట్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. F2 క్యారెక్టర్స్ తో పాటు ఈ సినిమాలో మరికొన్ని కొత్త తరహా పాత్రలను ఎలివేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఆర్టిస్టులను ఎలాంటి టైమింగ్ తో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక F3 సినిమాలో కూడా అన్ని పాత్రల్లో ఎదో ఒక కొత్త దనాన్ని చూపిస్తారట. అలాగే వెంకటేష్ ఫాదర్ రోల్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఇక ఆ ఫాదర్ పాత్ర చేయబోయేది మరెవరో కాదు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో ఆగ్రహంతో రెచ్చిపోయి హీరో ఫాదర్ గా ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న గోపారాజు రమణ. ఈ స్టెజ్ ఆర్టిస్ట్ ఆ సినిమా మొత్తనికే చాలా హైలెట్ అయ్యాడు.

ఇక F3 సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి వెంకీ తండ్రి పాత్రకు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎఫ్2 అంటేనే ఫన్ & ఫ్రస్ట్రేషన్.. అలాంటిది గోపారాజు లాంటి పాత్రను ఫ్రస్ట్రేషన్ తో చూపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. F3లో దర్శకుడు ఈ సారి మోర్ ఫన్ ఉంటుందని చెబుతున్నాడు. మరి సినిమా ఆడియెన్స్ అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus