Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్
- May 3, 2026 / 08:28 PM ISTByPhani Kumar
ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలంటే స్క్రిప్ట్, కెమెరా, ఆర్టిస్టులు, లొకేషన్స్.. ఇలా ఎన్నో కావాలి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. అసలు కెమెరా, మనుషులతో పనే లేకుండా, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
Raju Gaari Biryani
సరిగ్గా ఇలాగే తెలుగులో ఫస్ట్ టైమ్ పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రూపొందించిన యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ ‘రాజు గారి బిర్యానీ'(Raju Gaari Biryani). యూట్యూబ్‌లో రిలీజైన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దీని మేకింగ్ వెనుక ఉన్న కష్టం, ఆ ఎమోషనల్ స్టోరీ లైన్ తెలిస్తే ఎవరికైనా ఫ్యూజులు ఔట్ అవ్వాల్సిందే.’డెలూలూ ల్యాబ్స్’ (Delulu Labs) బ్యానర్‌పై అజిత్ గోనమంద ఈ యానిమేషన్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేశారు. 100% ఇది యానిమేటెడ్ ఫిల్మ్ కావడం విశేషం. మిడ్‌జర్నీ, ఎలెవెన్ ల్యాబ్స్, క్లింగ్, వాన్ (Wan) లాంటి అధునాతన ఏఐ టూల్స్ వాడి ఈ వీడియోను క్రియేట్ చేశారు. కేవలం ఇద్దరు వ్యక్తులు నాలుగు నెలల పాటు పగలు రాత్రి కష్టపడి ఈ బ్యూటిఫుల్ ఔట్‌పుట్ తీసుకొచ్చారు.
పర్ఫెక్షన్ కోసం ఏకంగా 14,000కు పైగా ఫ్రేమ్స్‌ను రిజెక్ట్ చేశారంటే వాళ్ల డెడికేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఏఐ బ్రిలియన్స్ చాలా స్పష్టంగా, నేచురల్‌గా కనిపిస్తుంది.అసలు ఈ షార్ట్ ఫిల్మ్ కథ విషయానికి వస్తే.. ‘బిర్యానీ రాజు’ జీవితాంతం ఒక పర్ఫెక్ట్ బిర్యానీ వండాలనే ఒకే ఒక డ్రీమ్‌తో బతికేస్తుంటాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆ ప్రయత్నం మాత్రం ఆపడు. అయితే ఒకరోజు ఆ బిర్యానీ వండుతున్న క్రమంలోనే సడెన్‌గా చనిపోతాడు.
రాజు చనిపోయాడని ఊరంతా గగ్గోలు.. అంతా ఆయన ఇంటికి చేరి ఆ బిర్యానీ గురించి, రాజు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. కిట్టు అనే కుర్రాడు.. సత్తన్న అనే వ్యక్తితో రాజు గురించి చెప్పే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగా సాగుతాయి.అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వస్తుంది. చనిపోయిన రాజు నేరుగా దేవుడి దగ్గరికి వెళ్లి.. ‘ఒకే ఒక్కసారి నన్ను కిందకు పంపించు.. నా బిర్యానీ యంకమ్మకి, ఊరి జనాలకు నచ్చిందో లేదో చూసి వెంటనే వచ్చేస్తా’ అని బతిమాలుతాడు.
దానికి దేవుడు..’నిన్ను ఇప్పుడు కాదు.. 25 ఏళ్ల ముందుకి.. అంటే ఫ్యూచర్‌లోకి పంపిస్తా’ అని ఆఫర్ ఇస్తాడు. అప్పుడు రాజు ఫ్యూచర్‌లోకి వెళ్లాడా? అక్కడ ఏమైంది? అసలు రాజు చేసిన బిర్యానీ పర్ఫెక్ట్ గా ఎలా కుదిరింది? అనేది ఆసక్తికర విషయాన్ని మంచి విజువల్స్‌తో కట్టిపడేసేలా చూపించారు. కథలోని ఎమోషన్, మ్యాజిక్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యి ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ ఇస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యూట్యూబ్‌లో ఈ మాస్టర్ పీస్‌ను చూసేయండి.
















