Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట
- May 3, 2026 / 08:11 PM ISTByPhani Kumar
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాణ సారధ్యంలో ‘తిమ్మరాజుపల్లి TV’(Thimmarajupalli TV) అనే చిన్న సినిమా వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. క్రిటిక్స్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Thimmarajupalli TV
ఈ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం 40 మంది ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చారు. అందులో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఇదివరకు సినిమాల్లో నటించినా వారికి ఎటువంటి గుర్తింపు లభించలేదు.

ఇదే సినిమాలో సిద్ధయ్య అనే విలన్ పాత్రతో ఓ నటుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతను మరెవరో కాదు లతీష్.నగరిలోని ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుండి సినిమాల్లోకి వచ్చిన ఇతను చాలా కష్టాలు పడ్డాడు. గతంలో ఉప్పు దొంగతనం చేసి ఆకలి తీర్చుకున్న రోజులను కూడా ఇతను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు.లతీష్ నటుడు కావాలనే కలతో హైదరాబాద్ కి వచ్చాడు. మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురైనా లతీష్ తన లక్ష్యాన్ని చేదించాలనే కసితో పనిచేశాడు.
‘బీ స్టూడియో’లో డా. షేక్ జాన్ బషీర్ వద్ద ఉచితంగా శిక్షణ పొంది తన నటనను మెరుగుపరుచుకున్నాడు. అక్కడి వేసిన నాటకాలే ‘తిమ్మరాజుపల్లి TV’లో అవకాశం తెచ్చిపెట్టాయట.సిద్ధయ్య పాత్రకు న్యాయం చేయడం కోసం లతీష్ ఏకంగా 30 కిలోల బరువు పెరిగి కొత్త మేకోవర్ తెచ్చుకున్నాడు. సినిమాలో ఇతని నటన చూసి కిరణ్ అబ్బవరం, నరేష్ అగస్త్య వంటి హీరోలు ఆశ్చర్యపోయి ప్రశంసలు కురిపించారట.
ముఖ్యంగా ఇతని గురువు అయినటువంటి బషీర్ సార్ గర్వంగా హగ్ చేసుకున్న క్షణం తన జీవితంలో మర్చిపోలేనిదని లతీష్ తెలిపాడు. సినిమాల్లోకి వచ్చాడనే కోపంతో మాట్లాడటం మానేసిన అన్నయ్య సైతం ‘తిమ్మరాజుపల్లి TV’లో లతీష్ నటన చూసి ప్రేమగా దగ్గరకి తీసుకుని అభినందించాడట. ఇదే తన అసలైన విజయమని లతీష్ సంతోషం వ్యక్తం చేశాడు.
అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?











