Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్
- February 7, 2026 / 01:36 PM ISTByFilmy Focus Desk
పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించిన ఓ సాధారణ యువకుడు. ఈ రోజు దేశం మొత్తం గర్వించదగ్గ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎవరో కాదు అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్న అనిరుధ్, తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఇప్పటికీ భావోద్వేగానికి లోనవుతారు.
Anirudh
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిన్న వయసులో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కీబోర్డ్ వాయించేవాడినని చెప్పారు. అప్పుడు ఎవరో రూ.500 ఇస్తే అదే పెద్ద విషయం, కొన్నిసార్లు డబ్బులకంటే తాంబూలం ఇచ్చి పంపేవారని చిరునవ్వుతో గుర్తు చేసుకున్నారు. “అప్పుడు ఆ తక్కువ డబ్బుతో వచ్చిన సంతోషం, ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా కూడా రావట్లేదు” అని చెప్పడం అనిరుధ్ సింప్లిసిటీకి నిదర్శనం.

తెలుగు సినిమాల్లో అనిరుధ్ సంగీతం అంటేనే యువతలో మంచి క్రేజ్ ఉంది. పవర్‌ఫుల్ బాక్గ్రౌండ్ స్కోర్స్, ట్రెండీ పాటలు, ఎమోషనల్ సాంగ్స్‌తో సినిమాలకు తన వంతు న్యాయం చేస్తారు అనిరుధ్. మాస్ సీన్లకు గూస్‌బంప్స్ వచ్చేలా, లవ్ సన్నివేశాలకు హార్ట్ టచ్ అయ్యేలా ఆయన మ్యూజిక్ ఉంటుంది. అందుకే దర్శకులు, హీరోలు అనిరుధ్ పేరు వినగానే భరోసాగా ఫీలవుతారు.
3 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనిరుద్, రాబోయే రోజుల్లో కూడా తెలుగు సినీ పరిశ్రమలో అనిరుధ్ పెద్ద ప్రాజెక్టులకు సంగీతం అందించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కష్టపడే తత్వం, నేర్చుకునే మనస్తత్వం ఉంటే సున్నా నుంచి శిఖరం వరకూ చేరవచ్చని అనిరుధ్ జీవితం చెప్పే సత్యం.












