Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇతని మ్యూజిక్ లో రూపొందే పాటలకి, అంతకు మించి ఇతను సమకూర్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి గిరాకీ ఉంది. చేతి నిండా ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అనిరుథ్ ప్రస్తుతం జైలర్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతుంది..

Anirudh – Kaviya

ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్న అనిరుథ్ వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అందుకే అతని పెళ్లి టాపిక్ పై కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈఓ కావ్య మారన్ తో అనిరుధ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడైతే త్వరలో ఈ జంట పెళ్ళిబంధంతో ఒక్కటవుతున్నట్టు మళ్ళీ ప్రచారం మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల అంటే నవంబర్ 11వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.

ఇప్పటికే అత్యంత సన్నిహితులకు శుభలేఖల పంపిణీ కార్యక్రమం కూడా మొదలైందట. దీంతో.. “రూమర్ లవర్స్ ఫైనల్ గా రియల్ లైఫ్ పార్ట్నర్స్ కాబోతున్నారు” అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అతి త్వరలో అనిరుథ్, కావ్య ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో..!

గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus