తెలుగులో ఎన్టీఆర్ సినిమాతోనే అనిరుధ్ పరిచయం
- December 12, 2016 / 06:41 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్రెష్ టీమ్ తో పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఆయన చేయనున్న సినిమాకు టెక్నీషియన్లందరినీ కొత్తగా తీసుకుంటున్నారు. తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్లో తొలిసారి తారక్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ మూవీకి దర్శకుడిగా బాబీని సెలక్ట్ చేసుకొని అందరినీ ఆశ్చర్య పరిచిన ఎన్టీఆర్ తాజాగా సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని ఎంపిక చేశారు. వై థిస్ కొలవెరి ఢీ అనే పాటతో బాగా పాపులర్ అయిన తమిళ మ్యూజిక్ డైరక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న మూవీ ద్వారా తెలుగులో పరిచయం కావడానికి సైన్ చేశారు.
ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను ఒప్పుకున్నారు. అయితే పవన్ సినిమా కంటే తారక్ మూవీనే ముందుగా రిలీజ్ అయ్యే ఆస్కారం ఉండడంతో అనిరుధ్ ని పరిచయం చేసే క్రెడిట్ బాబీ కే దక్కేలా ఉంది. సంక్రాంతి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. అందుకే ముగ్గురు భామలు సెలక్షన్ బాబీ బిజీగా ఉన్నారు. తారక్ కొత్త లుక్కులో అదరగొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. 60 కోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం జూన్ లో రిలీజ్ చేయాలనీ నిర్మాత కళ్యాణ్ రామ్ అనుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














