Anirudh: అనిరుధ్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి..!

అనిరుధ్ (Anirudh Ravichander)   ఇప్పుడు ఇండియా వైడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఎవ్వరూ అందనంత రేంజ్లో వెళ్లి కూర్చున్నాడు. ఎలాంటి సినిమానైనా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. తమిళంలో రజినీకాంత్ (Rajinikanth) , విజయ్ (Vijay Thalapathy) వంటి స్టార్ హీరోలకి అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. వాళ్ళ అభిమానులకి పూనకాలు తెప్పిస్తాయి. అందుకే మ్యాగ్జిమమ్ ఆ హీరోల సినిమాలు అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిరుధ్ ఉంటాడు.

Anirudh

ఇక తెలుగులో కూడా అనిరుధ్ బాగా బిజీ అయిపోయాడు. గతంలో ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జనాలకు రీచ్ అవ్వలేదు అని భావించి అతన్ని ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) సినిమా నుండి తీసేశారు. అయితే అదే బ్యానర్లో ‘జెర్సీ’ కి (Jersey)  ఛాన్స్ ఇచ్చి నాగవంశీ (Suryadevara Naga Vamsi) కాంపన్సేట్ చేయడం జరిగింది. ఇక కొన్నేళ్ల తర్వాత ‘దేవర’ (Devara)  కి ఎన్టీఆర్ (Jr NTR)కోరి మరీ అనిరుధ్ ను తెప్పించుకున్నాడు. ఆ సినిమాని అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే నిలబెట్టింది అని అంతా అనుకున్నారు.

అందుకే ఇప్పుడు అనిరుధ్.. తెలుగులో కూడా బిజీ అయిపోయాడు.పారితోషికం కూడా భారీగా అందుకుంటున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. అనిరుధ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. నాని నెక్స్ట్ సినిమా అయిన ‘ది పారడైజ్’ కి (The Paradise) అనిరుధ్ సంగీత దర్శకుడు. దీని కోసం అనిరుధ్ రూ.15 కోట్లు పారితోషికం అందుకున్నాడట. అయితే సినిమా ఆడియో రైట్స్ ను ‘సారెగమ’ సంస్థ రూ.18 కోట్లకు దక్కించుకుంది. అలా అనిరుధ్ పై పెట్టిన పెట్టుబడి రికవరీ అయినట్లు స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus