ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఇప్పుడు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అనడంలో ఎటువంటి సందేహం లేదు.
తన చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఒక సినిమా హైప్‌ను అమాంతం పెంచేయగల సత్తా అతని సొంతం.
‘విక్రమ్’ ‘జవాన్’ ‘లియో’ వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత అతను ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. మరోవైపు అతని రెమ్యూనరేషన్ కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంటుంది.కొందరు మిడ్-రేంజ్ హీరోల కంటే అతను తీసుకునే రెమ్యునరేషనే ఇప్పుడు ఎక్కువగా ఉండటం గమనార్హం.న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ‘ది పారడైజ్’ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ కోసం అతను ఏకంగా రూ.15 కోట్లు ఛార్జ్ చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. అసలు ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా తెలుగులో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. అంత భారీ పారితోషికం ఇవ్వడానికి కారణం.. అతను ఇచ్చే ఔట్‌పుట్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌పై భారీ ఇంపాక్ట్ చూపించడం వల్లనే. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని సాంగ్స్ రిలీజ్ కాగా, త్వరలో రాబోయే ఫుల్ ఆల్బమ్‌పై అంచనాలు వేరే రేంజ్‌లో ఉన్నాయి.
‘ది పారడైజ్’ సంగతి అలా ఉంచితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కనున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘AA23’ కోసం అనిరుధ్ రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఆయన సుమారు రూ.21 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే, ఇండియాలో ఈ మార్క్ టచ్ చేసిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రికార్డ్ సెట్ చేస్తాడు.
కేవలం ఇవే కాదు.. రజనీకాంత్ ‘జైలర్ 2’ (రూ.18 కోట్లు అని టాక్) ‘తలైవర్ 173’ దళపతి విజయ్ ‘జన నాయగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి.వీటితో పాటు షారుఖ్ ఖాన్ నెక్స్ట్ మూవీ, ‘విక్రమ్ 2’, లాంటి క్రేజీ ప్రాజెక్టులన్నీ అనిరుధ్ లైనప్‌లో ఉన్నాయి. తన చేతిలో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రేంజ్ చూస్తుంటే.. త్వరలోనే ఆయన రెమ్యునరేషన్ రూ.25 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.