టాలీవుడ్లో గత కొద్ది రోజులుగా మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌గా వినిపిస్తున్న పేరు ‘గాడ్ ఆఫ్ వార్’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,ఎన్టీఆర్(NTR) కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.
దేవతల సైన్యాధిపతి అయిన కార్తికేయుడి (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంగా.. ఒక హై-వోల్టేజ్ మైథలాజికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతున్నట్లు టాక్.
వచ్చే మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా ఈ ప్రాజెక్ట్‌పై గ్రాండ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడానికి త్రివిక్రమ్ టీమ్ ప్లానింగ్ చేస్తోందట. కేవలం ఒక పోస్టర్‌తో ఆపకుండా.. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను కట్ చేస్తున్నారని వినికిడి. సోషియో ఫాంటసీ, దేవుడి నేపథ్యం ఉన్న కథ కావడంతో.. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలోనే హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ వాడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో పనుల్లోనే టీమ్ బిజీగా ఉంది.
అనుకున్న టైమ్‌కి వీఎఫ్ఎక్స్ ఔట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వస్తే మాత్రం, మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ గ్యారెంటీ.’హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్‌ను నిర్మించనున్నారు. ‘అరవింద సమేత’ లాంటి పవర్ ఫుల్ హిట్ తర్వాత తారక్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు వేరే రేంజ్‌లో ఉన్నాయి.
ఫ్యాన్స్ కూడా తారక్ బర్త్‌డే రోజు ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.అంతా ప్లాన్ ప్రకారం జరిగితే, త్వరలోనే ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ అఫీషియల్ వీడియోతో యూట్యూబ్ రికార్డులు బద్దలవడం ఖాయం అనే చెప్పాలి.