ఈసారి నిజంగానే తల్లి కాబోతున్న హీరోయిన్ అనిత..!

అదేంటి.. అనిత ఈసారి నిజంగానే తల్లికాబోతుంది అని హెడ్డింగ్ పెట్టారు అని కంగారు పడకండి..! విషయం ఏమిటంటే.. గతంలో ఓసారి ఈమె ‘నాగిణి’ అనే సీరియల్లో తన పాత్ర కోసం ప్రెగ్నెంట్ గా ఫోటో షూట్లో పాల్గొంది. దాంతో నిజంగానే ఈమె ప్రెగ్నెంట్ అన్నట్టు అంతా ఫిక్సయిపోయారు. తీరా అది సీరియల్ కోసం అని తెలిసాక షాకయ్యారు. అయితే ఈసారి మాత్రం అనిత నిజంగానే ప్రెగ్నెంట్ అట. ఈ విషయాన్ని తనే కన్ఫర్మ్ చేసింది. తన ఇన్స్టా ద్వారా అనిత స్పందిస్తూ.. ‘త్వరలోనే ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాం.

మరో కొన్ని వారాల్లోనే మా బేబీకి వెల్కమ్ చెప్పబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది అనిత. దీంతో ఆమె అభిమానులు ఈమెకు ‘కంగ్రాట్యులేషన్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2001వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్ హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నువ్వు నేను’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనిత. అటు తరువాత ‘శ్రీరామ్’ ‘తొట్టి గ్యాంగ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి చిత్రాల్లో నటించింది.

అంతేకాదు నాగార్జున హీరోగా వచ్చిన ‘నేనున్నాను’ చిత్రంలో కూడా ఓ స్పెషల్ సాంగ్లో నర్తించింది. కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎక్కువ అవ్వడంతో తరువాత కోలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఈమెకు కలిసిరాకపోవడంతో హిందీ సీరియల్స్ చేసుకుంటుంది. వాటి ద్వారా ఈమె మంచి పాపులారిటీనే సంపాదించుకుంది.ఇక 2013 లో అనిత రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus