తెలుగమ్మాయి అంజలి కోలీవుడ్ లో బాగా క్లిక్ అయింది. ఒకానొక దశలో అక్కడ మంచి స్టార్ డమ్ సంపాదించుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకొని మిడ్ రేంజ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంది. ఆ తరువాత తెలుగులో కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘గీతాంజలి’ వంటి సినిమాలు ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే తనతో కలిసి ‘జర్నీ’తో పాటు ‘బెలూన్’ సినిమాలో జంటగా నటించిన హీరో జైతో నటి అంజలి సహజీవనం చేసిన సంగతి తెలిసిందే.
అప్పుడు తమ బంధాన్ని వాళ్లు దాచుకోవాలని కూడా ప్రయత్నించలేదు. జ్యోతిక నటించిన ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భార్య పక్కనుండగా దోసె వేయమంటూ సూర్య ఒక ఛాలెంజ్ విసిరితే.. అంజలి పక్కనుండగా జై ఈ ఛాలెంజ్ ను ట్రై చేశారు. అప్పుడే వారి మధ్య బంధం బయటపడింది. కానీ తరువాత ఏమైందో కానీ వీరిద్దరూ విడిపోయారు. పెళ్లి చేసుకుంటారనుకున్న ఈ జంట విడిపోవడం చాలా మందికి షాకిచ్చింది. బ్రేకప్ అయినప్పటి నుంచి అంజలి సింగిల్ గానే ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో ఆమె పెళ్లి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిపై స్పందిస్తూ.. ఒకప్పటి తన రిలేషన్ గురించి మాట్లాడింది అంజలి. కొన్నేళ్లముందు తనొక టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చెప్పింది అంజలి. ఆ రిలేషన్ పై చాలా ఆశలు పెట్టుకున్నానని.. కానీ అది తను ఊహించినంత అందంగా లేదని తెలిపింది.
ఇండస్ట్రీలోని వ్యక్తితో తను రిలేషన్ లో ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదని తెలిపింది. ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని.. ఎవరితో క్లోజ్ గా ఉంటాననేది తన వ్యక్తిగత విషయమని క్లారిటీ ఇచ్చింది.