డైరెక్టర్ త్రివిక్రమ్ కు నో చెప్పిన అనన్య!
- February 17, 2016 / 12:43 PM ISTByFilmy Focus
త్రివిక్రమ్ సినిమా లో ఛాన్స్ దొరికితే చాలు అని ఎదురు చూసే ఎంతో మంది నటులున్నారు.అలాంటిది త్రివిక్రమే స్వయంగా అడిగితే నో అని చెప్పింది ఈ భామ.ఇంతకీ ఎవరు ఆమె అని అనుకుంటున్నారా?ఇంకెవరు బాల నటిగా మొదలు పెట్టి జర్నీ సినిమాతో హిట్ కొట్టిన అనన్య.
‘అ ఆ’ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం త్రివిక్రమ్ అనన్య ను సంప్రదిస్తే తను ఒక్క సారిగా నో అని చెప్పేసి త్రివిక్రమ్ ని ఆశ్చర్యం లోనికి నెట్టేసింది.అని హీరోయిన్ గా చేసిన తను చెల్లి పాత్ర చెయ్యడం ఇష్టం లేదని చెప్పిందని టాక్.ఆ తరువాత త్రివిక్రమ్ తన క్యారెక్టర్ గురుంచి వివరగా చెప్పడం తో చివరకు ఒప్పుకుంది అని వినికిడి.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న అనుకోని కారణాల వల్ల లేట్ అయ్యింది.వచ్చే సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















