బాహుబలి కంక్లూజన్ కి మొదలైన అవార్డుల వరద
- August 11, 2017 / 01:35 PM ISTByFilmy Focus
మొన్న రొమేనియా.. నిన్న మాస్కో.. నేడు మెల్బోర్న్ .. బాహుబలి అడుగుపెట్టిన చోటల్లా .. అభినందనలతో పాటు అవార్డులను సొంతం చేసుకుంటోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ వంద రోజులు పూర్తి చేసుకొని చిత్ర బృందంలో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంలో మరో సంతోషకరమైన వార్తను మోసుకొచ్చింది. మొన్నటి వరకు మెల్బోర్న్ లో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ మెల్బోర్న్ జరిగింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన సినిమాలను ప్రదర్శించారు. బాహుబలి 2 ని కూడా ప్రదర్శించారు. వీటన్నింటినీ చూసిన అతిధులు బాహుబలికి టెల్ స్ట్రా పీపుల్స్ ఛాయస్ అవార్డు ను అందించారు.
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకోవడాన్నే గర్వంగా ఫీలవుతున్న బాహుబలి చిత్ర యూనిట్ సభ్యులు ఈ అవార్డు మరింత ఆనందాన్ని కలిగించింది. ఈ జోరు చూస్తుంటే 2017 చలన చిత్ర అవార్డ్స్ వేడుకలలో ఈ సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















