‘సాహో’ లో మరో బాలీవుడ్ నటుడు!
- July 24, 2017 / 03:10 PM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను టీజర్ మరింత పెంచింది. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్స్ ప్రకారం వేగంగా జరుగుతుంది. ‘బాహుబలి’ తో ప్రభాస్ కు బాలీవుడ్లో ఏర్పడిన భారీ మార్కెట్ పై శ్రద్దపెట్టిన చిత్ర యూనిట్ అక్కడి ప్రేక్షకులకు మన సినిమా అనే ఫీలింగ్ కలిగేలా బాలీవుడ్ నటుల్ని ప్రాజెక్టులోకి తీసుకుంటోంది.
ఇప్పటికే ప్రధాన ప్రతినాయకుడిగా ‘కత్తి’ ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ ను తీసుకోగా తాజాగా మరో బాలీవుడ్ హీరోను సినిమాలోకి తీసుకుంది. హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించిన చుంకీ పాండే ‘సాహో’ లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతున్నప్పటికీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















