‘రాకా’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. వాటిలో ఏది నిజం, ఏది నిజం కాదు అనే వివరాలు చెప్పకుండా ‘రూమర్ల’ ప్రచారాన్ని టీమ్ ఎంజాయ్ చేస్తోంది అని కూడా అనుకున్నాం. నిజంగా టీమ్ అలా అనుకుంటుందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మరో రూమర్ చిన్నగా లీక్ అయి బయటకు వచ్చింది. అదే సినిమాలో ఓ బాలీవుడ్ హీరో నటించడం పక్కా అని. అదేంటి మొన్నీమధ్య అది రూమరే.. ఆ హీరో నటించడం లేదు అని చాలామంది క్లారిటీలు ఇచ్చారు కదా అనుకుంటున్నారా?
అవును.. క్లారిటీలు నిజమే. అయితే ఆ హీరో నటించడం లేదు అనే విషయానికే ఆ క్లారిటీ పరిమితం. ఆ హీరో కాకపోయినా మరో బాలీవుడ్ హీరో ముఖ్యమైన పాత్రలో నటించడం పక్కా అని చెబుతున్నారు. దీని కోసం ఇద్దరి పేర్లు చర్చలోకి వచ్చాయని చెబుతున్నారు. ఓ హీరో ఇటు గీతా ఆర్ట్స్‌కి, మరో హీరో దర్శకుడు అట్లీకి దగ్గరవాడు అవ్వొచ్చు అని చెబుతున్నారు. ఇంత దగ్గరి వారు ఎవరా అని చూస్తే.. రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి షాహిద్ కపూర్, రెండోది వరుణ్ ధావన్.
‘షాహిద్ కపూర్’ నటించిన ‘జెర్సీ’ సినిమా రీమేక్‌కి గీతా ఆర్ట్స్ ఓ నిర్మాత. ఇక ‘తెరి’ సినిమా బాలీవుడ్ రీమేక్ ‘బేబీ జాన్’ సినిమాలో నటించింది వరుణ్ ధావన్. ఈ పరిచయాల కారణంగానే ఈ ఇద్దరిలో ఒకరు అల్లు అర్జున్ సినిమాలో నటిస్తారు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. మరి అట్లీ ప్లానింగ్‌లో ఏముందో చూడాలి. ఏం చేసినా ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఓ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. దీపికా పడుకొణె సినిమాలో ఉన్నప్పటికీ ఓ హీరో కూడా ఉంటే బెటర్ అని అనుకుంటున్నారనిపిస్తోంది.