Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా విలేకరి సమావేశంలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు నిర్మాతల్లో ఒకరైన సాయి రాజేష్. అవి మీ కోసం:

Sai Rajesh Interview

ప్ర) స్టీవెన్ శంకర్ పేరుతో మీ సినీ ప్రయాణం మొదలైంది? ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటున్నారు.. ఎలా అనిపిస్తుంది?
సాయి రాజేష్: చాలా హ్యాపీగా ఉంది.! మొదటి సినిమా చేస్తున్నప్పుడు నా అసలు పేరు ఎవరికీ తెలీకూడదు, అసలు నా ముఖం ఎవరూ చూడకూడదు అనే ఉద్దేశంతో ‘స్టీవెన్ శంకర్’ అని పేరు పెట్టుకున్నాను. స్టీవెన్ స్పీల్ బర్గ్ లో స్టీవెన్, శంకర్ లో శంకర్. ‘కలర్ ఫోటో’ సినిమాకి ఫస్ట్ టైం నా పేరు వాడాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు పెట్టిన పేరుతో గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.

ప్ర) ‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజ్ కి ముందు టెన్షన్ పడ్డారా?
సాయి రాజేష్: ప్రతి సినిమాకి టెన్షన్ పడతాను. కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’కి ముందు పడ్డ టెన్షన్ తక్కువగానే ఉండేది. అలా అని సినిమా ఫ్లాప్ అవుతుందని కాదు.. నేను కరెక్ట్ ఎఫర్ట్ పెట్టానా లేదా..? ఎక్కడైనా నెగ్లిజెన్స్ జరిగిందా? వంటి భయాలు మాత్రమే..! ‘బేబీ’ సినిమాకి ఎక్కువ భయపడ్డాను.

ప్ర) ‘బేబీ’ విషయంలో మిమ్మల్ని భయపెట్టింది ఏంటి?
సాయి రాజేష్ : ‘బేబీ’ రిలీజ్ టైమ్ లో సోషల్ మీడియాలో ‘వాకౌట్’ అనే పదాన్ని బాగా వాడారు. అది నన్ను బాగా టెన్షన్ పెట్టింది. ‘వాకౌట్’ అంటే ఫస్ట్ రోజే వాషౌట్ అయిపోయే పరిస్థితి తీసుకొస్తారేమో అనుకున్నాను. కానీ మేము గట్టిగా ఫైట్ చేశాం. అందరం కూర్చుని ప్రెస్ మీట్స్ పెట్టి, సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కి సమాధానాలు ఇచ్చి ప్రమోట్ చేసుకున్నాం. ఫైనల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ నెగెటివిటీ అంతా పోయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫీమేల్ ఆడియన్స్ నుండి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి.

ప్ర) ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా లెంగ్త్ గురించి ఎప్పుడైనా కంగారు పడ్డారా?
సాయి రాజేష్: కచ్చితంగా భయం వేసింది. నేనే స్వయంగా ఐదున్నర గంటల ఫుటేజ్ ని ఎడిట్ చేసి తగ్గించాను. సినిమా తీసిన వాడికి కట్ చేయడం చాలా కష్టం. ఒక దశలో ఏది ఉంచాలో, ఏది తీసేయాలో అర్థం కాదు. కానీ సినిమా రిజల్ట్ బాగున్నప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం.

ప్ర) క్లైమాక్స్ సీన్ గురించి సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.. దాని గురించి ఎలా రియాక్ట్ అవుతారు?
సాయి రాజేష్: దానికి నేను అగ్రీ చేస్తాను. మాకు కొంచెం టైం ఉంటే రెక్టిఫై చేసుకునేవాళ్లం..! సెన్సార్ వల్ల కూడా హడావిడి హడావిడి అయిపోయింది.

ప్ర) ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాని కొంతమంది ఈవీవీ గారి ‘ఆమె’తో పోలుస్తున్నారు?
సాయి రాజేష్: బహుశా.. ఒకటి రెండు సన్నివేశాల వల్ల అలా అనిపించి ఉండొచ్చు. కానీ మీరు యాక్సిడెంట్ సీన్ చూస్తే మీకు ‘మౌనరాగం’ పోస్టర్ కనిపిస్తుంది. మణిరత్నం గారి ‘మౌనరాగం’ స్పూర్తితో ‘చెన్నై లవ్ స్టోరీ’ కథ రాసుకున్నాను. ఆ సినిమాకి ఇదొక ట్రిబ్యూట్ అనుకోవచ్చు.

ప్ర) ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రాజెక్టు ఫస్ట్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవితో చేయాలి అనుకున్నారు? వాళ్ళు ఎందుకు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు?
సాయి రాజేష్ : ఆనంద్, వైష్ణవి..లతో ఈ ప్రాజెక్టు చేయాలని అనుకున్నాం. కానీ నేను స్క్రిప్ట్ డిజైన్ చేయడానికి ఏడాది టైం తీసుకున్నాను. ఈ గ్యాప్లో వాళ్ళకి ‘ఎపిక్’ ఛాన్స్ వచ్చింది. మేము కూడా అడ్డు చెప్పలేదు. వాళ్ళు చేసుంటే.. ఈ సినిమాకి ఇంకా భారీ ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. కానీ ‘బేబీ’ తో కంపేర్ చేసి నెగిటివ్ కామెంట్స్ కూడా చేసేవారు. సో అంతా మంచే జరిగింది అనుకుంటాను.

ఇంటర్వ్యూయర్: డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. మరో దాసరి అవుదామని అనుకుంటున్నారా?
సాయి రాజేష్: దాసరి గారి రేంజ్ వేరు. నాకు అంత స్థాయి లేదు. కానీ ఇండస్ట్రీలో కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, కనీస వేతనాలు వంటి సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఎవరైనా ఒక యాక్టివ్ డైరెక్టర్ ఉంటే బాగుంటుందని నన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసుకున్నారు. అది కూడా చాలా పెద్ద బాధ్యత. ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూడటమే నా లక్ష్యం.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?
సాయి రాజేష్: ప్రస్తుతం ‘బేబీ’ హిందీ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాను. అక్టోబర్ కల్లా దాని షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమాలనే ఆలోచనలో ఉన్నాను. ఈసారి హ్యాపీ ఎండింగ్ ఉండేలా సినిమా చేస్తాను(నవ్వుతూ)

ప్ర) ఆల్ ది బెస్ట్ అండి
సాయి రాజేష్ : థాంక్యూ సో మచ్

 

అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

 

 

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus