Sharwanand: ‘శర్వా 35’ ఆ హీరో సర్ప్రైజ్ ఇస్తాడట..!

Advertisement

శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇది శర్వానంద్ కెరీర్లో 35వ సినిమా. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ చాలా వరకు పూర్తయ్యింది. త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి టైటిల్ ను, చిన్న గ్లింప్స్ ను లాంచ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటి వరకు క్రైమ్ టచ్ ఉన్న సినిమాలే తీశాడు. కానీ ఫస్ట్ టైం ఓ కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. అలాగే ఇందులో చాలా సర్ప్రైజ్..లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకో హీరో కూడా ఉంటాడని సమాచారం. కథ ప్రకారం ఈ సినిమాలో ఇంకో హీరోకి స్పేస్ ఉంటుందట. ఆ పాత్ర కోసం యంగ్ హీరో శివ కందుకూరిని చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. శివ కందుకూరి హీరోగా ‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ వంటి సినిమాలు చేశాడు.

అన్నీ కూడా డీసెంట్ టాక్ ను రాబట్టుకున్నాయి. శివ కందుకూరి ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘శర్వానంద్ 35 ‘(Sharwanand) వ సినిమా అయిన ‘మనమే’ తో అతను మరింత మంచి పేరు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి శివ కందుకూరి షూటింగ్ కూడా ఫినిష్ అయినట్టు ఇన్సైడ్ టాక్.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus