సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న మరో హీరోయిన్

  • January 19, 2018 / 06:07 AM IST

సీనియర్ హీరోయిన్స్ కి నేటి హీరోయిన్స్ అందం, అభినయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా తమ పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకొని ఔరా అనిపిస్తున్నారు. అ..ఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్, ఫిదా సినిమాలో సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ కి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే అజ్ఞాతవాసి మూవీలో నటించిన కీర్తి సురేష్, అను ఇమ్యానుయేల్ లు సొంత వాయిస్ తో ఆకట్టుకున్నారు. ఈ బాటలోనే మరో పరభాషా హీరోయిన్ నడుస్తోంది. కన్నడ కిరిక్ పార్టీ సినిమాతో పాపులర్ అయిన రష్మిక తెలుగులోను అడుగుపెడుతోంది. ఆమె నటించిన తెలుగు తొలి సినిమా “చలో” ఫిబ్రవరి రెండున విడుదల కానుంది.

వెంకి కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన పాత్రకు రష్మిక సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తొలి సినిమాతోనే తెలుగుపై పట్టుసాధించడం చూసి చిత్రం బృదం ఆమెను అభినందించింది. ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రముఖ కెమెరామెన్ సాయి శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తోంది. యువ హీరో నాగ శౌర్య చేస్తున్న సినిమాకి, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో హీరోయిన్ గా ఓకే చెప్పింది. వీటికి కూడా స్వయంగా రష్మిక డబ్బింగ్ చెప్పుకొని అభిమానులను పెంచుకోనుంది. తెలుగు నటిగా పేరు తెచ్చుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus