మెగాస్టార్ చిరంజీవి పక్కన మరోసారి హీరోయిన్!

  • September 23, 2016 / 12:18 PM IST

మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ డైరక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న150 వ సినిమా “ఖైదీ నంబర్ 150” షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రైతుల కోసం పోరాడే వ్యక్తిగా, సైన్టిస్ట్ గా నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా టాలీవుడ్ క్వీన్  కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఆమె, చిరులపై కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా పూర్తి చేశారు.

తాజాగా మరో హీరోయిన్ గా శ్రియను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వందో చిత్రం  గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ లో శ్రియ పాల్గొంటోంది. ఈ సమయంలో చిరు సినిమాలో ఆఫర్ రావడంతో ఆనందంగా ఒకే చెప్పింది. వీరిద్దరూ ఠాగూర్ సినిమాలో కలిసి నటించారు. మళ్లీ ఈ జోడి తెరపైన కనువిందు చేయనుంది.

అయితే ఈ చిత్రంలో శ్రియ కొంతసేపు మాత్రమే కనిపిస్తుందని సమాచారం.  కొణిదెల బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న “ఖైదీ నంబర్ 150” చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus