బహుబలి ఖాతాలో మరో రికార్డు!

  • June 30, 2017 / 10:39 AM IST

బాహుబలి…బాహుబలి…బాహుబలి…ఇంకా ఈ రికార్డుల మోత ఆగలేదు…ఇంకా ఈ ప్రభంజనం ఎక్కడా తగ్గలేదు…ఇంకా ఈ చలన చిత్ర వండర్ పై అభిమానులకు ఆశ పోలేదు…అవును తెలుగు చలన చిత్ర స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసిన సినిమాగా…ఫేస్ ఒఫ్ ద ఇండియన్ సినిమాగా మంచి పేరు సాధించిన ఈ సినిమా రికార్డుల పరంపర సినిమా ఫర్స్ట్ లుక్ విడుదల నుంచే మొదలుపెట్టింది. అయితే సినిమా రిలీజ్ అయ్యీ, భారీ హిట్ అయినా ఈ సినిమా ఎక్కడా తగ్గడం లేదు…విషయం లోకి వెళితే…రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలు పెట్టిన ఈ చిత్రం విడుదల తర్వాత రికార్డుల మీద రికార్డులు బద్దలు గొడుతూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నా విషయం మనకు తెలిసిందే.దేశంలోనే అత్యధిక స్క్రీన్లపై విడుదలైన సినిమాగా, అతి తక్కువ రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన బాహుబలి 2 ది కంక్లూజన్ ను మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో తొలి చిత్రంగా ప్రదర్శించడం ఆ సినిమాకున్న గొప్పదనాన్ని తెలియజేస్తోంది.

ఇంతవరకూ ఒక ఎత్తు అయితే తాజాగా మరో రికార్డు బాహుబలిని వరించింది…అదేంటి అంటే…ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను ఇప్పటి వరకు 7 కోట్ల మంది వీక్షించారు. తద్వారా 7 కోట్ల వ్యూస్ దాటిన తొలి ట్రైలర్‌ గానూ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఓ ప్రాంతీయ చిత్రానికి ఇంతటి ఘనత దక్కడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విటర్‌ ద్వారా తెలుపుతూ.. “ఇండియన్‌ బాక్సాఫీస్‌” ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది. “జై మాహిష్మతి” అని ట్వీట్‌ చేసింది. ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ ఘనత దక్కడం విశేషం. ఇదిలా ఉంటే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇంకా బాహుబలి ఖాతాలోకి వెళ్ళ వలిసిన రికార్డులు ఇంకా ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus