Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ANR: ఈ పాటలో ఏఎన్నార్ ఏంతమంది హీరోయిన్లతో ఆడిపాడారంటే..!

ANR: ఈ పాటలో ఏఎన్నార్ ఏంతమంది హీరోయిన్లతో ఆడిపాడారంటే..!

  • November 24, 2022 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ANR: ఈ పాటలో ఏఎన్నార్ ఏంతమంది హీరోయిన్లతో ఆడిపాడారంటే..!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. లెజెండ్.. ఆయన చేసిన సినిమాలు.. క్యారెక్టర్లు, క్రియేట్ చేసిన రికార్డులు మరెవరికీ సాధ్యం కావు.. దేవదాసు అయినా, ప్రేమనగర్ అయినా ప్రేమాభిషేకం అయినా దసరా బుల్లోడు అయినా అక్కినేనే.. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనే తన కోరికను నెరవేర్చుకున్న పరిపూర్ణమైన నటుడాయన… ఏఎన్నార్ పాత సినిమాలను గురించిన అరుదైన విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇప్పుడలాంటి ఓ చిత్రానికి సంబంధించిన న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమా ‘మాయాబజార్’.. పాత ‘మాయాబజార్’ కాదు.. 1995లో దర్శకరత్న దాసరి, అక్కినేనితో తెరకెక్కించిన ‘మాయాబజార్’ ఇది. ఇందులో సుమన్, ఆమని తదితరులు నటించారు. ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు ప్రస్తావన వచ్చిందంటే.. ఇందులో ‘అవే కళ్లు.. అదే చూపు.. అదే సిగ్గు.. అదే బుగ్గ’ అనే సాంగ్ ఉంటుంది.. ANR డ్యాన్స్ చేసిన చివరి డ్యూయెట్ ఇది. అక్కినేనితో అయిదుగురు హీరోయిన్లు (రమ్యకృష్ణ, సౌందర్య, రంభ, రోజా, మాలాశ్రీ) స్టెప్పులేశారు.

ఈ ముద్దుగుమ్మలంతా వన్ బై వన్ సెట్‌లోకొచ్చి ఆయనతో చిందులేసి వెళ్తుంటారు. అప్పట్లో ఈ పాటను తెరమీద చూడడం ప్రేక్షకాభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చింది.. ఈ హీరోయిన్లంతా అప్పటికీ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అక్కినేని పక్కన అదీ దాసరి సినిమా కావడంతో కాల్షీట్లు అడ్జెస్ట్ చేసుకుని మరీ ఈ సాంగ్ చేశారు.

ఏఎన్నాఆర్ షాకింగ్ నిర్ణయం..

ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే.. ఏఎన్నార్ ఇది తాను నర్తించే చివరి పాట అని.. ఇకపై పాటల్లో డ్యాన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను అని ప్రకటించారు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆ రకంగా ఆయన స్క్రీన్ మీద హీరోయిన్లతో ఆడిపాడిన చివరి పాటగా ‘అవే కళ్లు’ నిలిచిపోయింది. అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్స్ వేసి ఈ పాటను చిత్రీకరించారు.. అన్నమాట ప్రకారం అక్కినేని నాగేశ్వర రావు ‘మాయాబజార్’ తర్వాత ఏ సినిమాలోనూ కథానాయికలతో కలిసి డ్యాన్స్ చేయలేదు. నటసామ్రాట్‌కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageshwara Rao
  • #ANR
  • #Maya Bazaar

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

9 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

9 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

11 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

10 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

11 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

12 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

13 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version