ANR: ఈ పాటలో ఏఎన్నార్ ఏంతమంది హీరోయిన్లతో ఆడిపాడారంటే..!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. లెజెండ్.. ఆయన చేసిన సినిమాలు.. క్యారెక్టర్లు, క్రియేట్ చేసిన రికార్డులు మరెవరికీ సాధ్యం కావు.. దేవదాసు అయినా, ప్రేమనగర్ అయినా ప్రేమాభిషేకం అయినా దసరా బుల్లోడు అయినా అక్కినేనే.. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనే తన కోరికను నెరవేర్చుకున్న పరిపూర్ణమైన నటుడాయన… ఏఎన్నార్ పాత సినిమాలను గురించిన అరుదైన విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇప్పుడలాంటి ఓ చిత్రానికి సంబంధించిన న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమా ‘మాయాబజార్’.. పాత ‘మాయాబజార్’ కాదు.. 1995లో దర్శకరత్న దాసరి, అక్కినేనితో తెరకెక్కించిన ‘మాయాబజార్’ ఇది. ఇందులో సుమన్, ఆమని తదితరులు నటించారు. ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు ప్రస్తావన వచ్చిందంటే.. ఇందులో ‘అవే కళ్లు.. అదే చూపు.. అదే సిగ్గు.. అదే బుగ్గ’ అనే సాంగ్ ఉంటుంది.. ANR డ్యాన్స్ చేసిన చివరి డ్యూయెట్ ఇది. అక్కినేనితో అయిదుగురు హీరోయిన్లు (రమ్యకృష్ణ, సౌందర్య, రంభ, రోజా, మాలాశ్రీ) స్టెప్పులేశారు.

ఈ ముద్దుగుమ్మలంతా వన్ బై వన్ సెట్‌లోకొచ్చి ఆయనతో చిందులేసి వెళ్తుంటారు. అప్పట్లో ఈ పాటను తెరమీద చూడడం ప్రేక్షకాభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చింది.. ఈ హీరోయిన్లంతా అప్పటికీ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అక్కినేని పక్కన అదీ దాసరి సినిమా కావడంతో కాల్షీట్లు అడ్జెస్ట్ చేసుకుని మరీ ఈ సాంగ్ చేశారు.

ఏఎన్నాఆర్ షాకింగ్ నిర్ణయం..

ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే.. ఏఎన్నార్ ఇది తాను నర్తించే చివరి పాట అని.. ఇకపై పాటల్లో డ్యాన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను అని ప్రకటించారు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆ రకంగా ఆయన స్క్రీన్ మీద హీరోయిన్లతో ఆడిపాడిన చివరి పాటగా ‘అవే కళ్లు’ నిలిచిపోయింది. అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్స్ వేసి ఈ పాటను చిత్రీకరించారు.. అన్నమాట ప్రకారం అక్కినేని నాగేశ్వర రావు ‘మాయాబజార్’ తర్వాత ఏ సినిమాలోనూ కథానాయికలతో కలిసి డ్యాన్స్ చేయలేదు. నటసామ్రాట్‌కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus