Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » ఇద్దరు లెజెండరీ దర్శకులు డైరెక్ట్ చేసిన ఏఎన్నార్ సినిమా ఇన్నాళ్లు ఎందుకు ఆగిందంటే..!

ఇద్దరు లెజెండరీ దర్శకులు డైరెక్ట్ చేసిన ఏఎన్నార్ సినిమా ఇన్నాళ్లు ఎందుకు ఆగిందంటే..!

  • November 3, 2022 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్దరు లెజెండరీ దర్శకులు డైరెక్ట్ చేసిన ఏఎన్నార్ సినిమా ఇన్నాళ్లు ఎందుకు ఆగిందంటే..!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు చలనచిత్ర చరిత్రలో, దాదాపు 70 సంవత్సరాల సుదీర్ఘ నట జీవితంలో ఆయన పోషించని పాత్రలు, చేయని ప్రయోగాలు లేవు.. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలనే తన కోరికను తీర్చుకున్నారు అక్కినేని.. ఇప్పుడు నటసామ్రాట్ నటించిన సినిమా విడుదల కాబోతోంది.. మరోసారి ఆయణ్ణి తెరపై చూడబోతున్నారు అభిమానులు, తెలుగు ప్రేక్షకులు..

నిజమే.. 40 సంవత్సరాలుగా ఆయన నటించిన ‘ప్రతిబింబాలు‘ అనే చిత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు.. ఈ నవంబర్ 5న థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.. ఆ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం.. అక్కినేని, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో ఏఎన్నార్ ద్విపాత్రాభినయం చేశారు.

గుమ్మడి, కాంతారావు, సాక్షి రంగారావు, అన్నపూర్ణ, జయమాలిని, అనురాధ తదితరులు కూడా నటించారు. కె.యస్. ప్రకాశ రావు (దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తండ్రి) దర్శకత్వంలో.. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ మీద జాగర్లమూడి రాధకృష్ణ నిర్మించారు.. దర్శకుడిగా సింగీతం శ్రీనివాస రావు పేరు ఎందుకు వేశారంటే.. ‘ప్రతిబింబాలు’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన మరణించారు. దీంతో సింగీతం చిత్రాన్ని పూర్తి చేశారు.

1982 నుండి 2022 వరకు 40 ఏళ్లపాటు ఎందుకు రిలీజ్ కాలేదంటే..

నిర్మాత రాధకృష్ణ అప్పటికే ‘వియ్యాలవారి కయ్యాలు, ’కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త’, ‘కోరుకున్న మొగుడు’ లాంటి చిత్రాలు చేశారు. షూటింగ్ జరిగిన తర్వాత సీన్లు మార్చడం, ఆర్టిస్టుల డేట్స్, ఆర్థిక, న్యాయపరమైన సమస్యలన్నీ సినిమాను చుట్టుముట్టాయి.. అక్కినేని కూడా సినిమాను విడుదల చేయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ వీలు పడలేదు..

క్వాలిటీ ప్రింట్లతో భారీస్థాయిలో విడుదల..

స్పెషల్ షోలు, రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో ‘ప్రతిబింబాలు’ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాత కొద్దికాలంగా ప్రయత్నిస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవాలని కాదు కానీ ఎలాగైనా ప్రేక్షకాభిమానులకు సినిమా చూపించాలనేది ఆయన కోరిక. గతేడాది మే నెలలో రిలీజ్ చేద్దామనుకున్నారు.. తర్వాత ఈ సంవత్సరం సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా కూడా అనుకున్నారు అదీ కుదర్లేదు.. ఎట్టకేలకు ఈ నవంబర్ 5 (శనివారం) గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

డీఐ, డీటీఎస్ లాంటి టెక్నాలజీ డిజిటల్‌లోకి మార్చి.. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ 225 కేంద్రాల్లో విడుదల చేయనున్నారు. నిర్మాత ప్రయత్నం అభినందించదగినదే కానీ నాగార్జున, నాగ చైతన్య లాంటి అక్కినేని హీరోలతో ప్రమోషన్ చేయించినా, ఏదైనా ఈవెంట్ ఏర్పాటు చేసినా.. ‘ప్రతిబింబాలు’ రిలీజ్ విషయం జనాల్లోకి ఇంకా బాగా వెళ్లేది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #Jayasuda
  • #KS Prakash Rao
  • #Prathibimbalu
  • #Singeetham Srinivasarao

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

10 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 days ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version