నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు చలనచిత్ర చరిత్రలో, దాదాపు 70 సంవత్సరాల సుదీర్ఘ నట జీవితంలో ఆయన పోషించని పాత్రలు, చేయని ప్రయోగాలు లేవు.. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలనే తన కోరికను తీర్చుకున్నారు అక్కినేని.. ఇప్పుడు నటసామ్రాట్ నటించిన సినిమా విడుదల కాబోతోంది.. మరోసారి ఆయణ్ణి తెరపై చూడబోతున్నారు అభిమానులు, తెలుగు ప్రేక్షకులు..
నిజమే.. 40 సంవత్సరాలుగా ఆయన నటించిన ‘ప్రతిబింబాలు‘ అనే చిత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు.. ఈ నవంబర్ 5న థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.. ఆ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం.. అక్కినేని, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో ఏఎన్నార్ ద్విపాత్రాభినయం చేశారు.
గుమ్మడి, కాంతారావు, సాక్షి రంగారావు, అన్నపూర్ణ, జయమాలిని, అనురాధ తదితరులు కూడా నటించారు. కె.యస్. ప్రకాశ రావు (దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తండ్రి) దర్శకత్వంలో.. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ మీద జాగర్లమూడి రాధకృష్ణ నిర్మించారు.. దర్శకుడిగా సింగీతం శ్రీనివాస రావు పేరు ఎందుకు వేశారంటే.. ‘ప్రతిబింబాలు’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన మరణించారు. దీంతో సింగీతం చిత్రాన్ని పూర్తి చేశారు.
1982 నుండి 2022 వరకు 40 ఏళ్లపాటు ఎందుకు రిలీజ్ కాలేదంటే..
నిర్మాత రాధకృష్ణ అప్పటికే ‘వియ్యాలవారి కయ్యాలు, ’కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త’, ‘కోరుకున్న మొగుడు’ లాంటి చిత్రాలు చేశారు. షూటింగ్ జరిగిన తర్వాత సీన్లు మార్చడం, ఆర్టిస్టుల డేట్స్, ఆర్థిక, న్యాయపరమైన సమస్యలన్నీ సినిమాను చుట్టుముట్టాయి.. అక్కినేని కూడా సినిమాను విడుదల చేయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ వీలు పడలేదు..
క్వాలిటీ ప్రింట్లతో భారీస్థాయిలో విడుదల..
స్పెషల్ షోలు, రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో ‘ప్రతిబింబాలు’ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాత కొద్దికాలంగా ప్రయత్నిస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవాలని కాదు కానీ ఎలాగైనా ప్రేక్షకాభిమానులకు సినిమా చూపించాలనేది ఆయన కోరిక. గతేడాది మే నెలలో రిలీజ్ చేద్దామనుకున్నారు.. తర్వాత ఈ సంవత్సరం సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా కూడా అనుకున్నారు అదీ కుదర్లేదు.. ఎట్టకేలకు ఈ నవంబర్ 5 (శనివారం) గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
డీఐ, డీటీఎస్ లాంటి టెక్నాలజీ డిజిటల్‌లోకి మార్చి.. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ 225 కేంద్రాల్లో విడుదల చేయనున్నారు. నిర్మాత ప్రయత్నం అభినందించదగినదే కానీ నాగార్జున, నాగ చైతన్య లాంటి అక్కినేని హీరోలతో ప్రమోషన్ చేయించినా, ఏదైనా ఈవెంట్ ఏర్పాటు చేసినా.. ‘ప్రతిబింబాలు’ రిలీజ్ విషయం జనాల్లోకి ఇంకా బాగా వెళ్లేది..
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!