యూట్యూబ్ లో ర‌చ్చ చేస్తోన్న అంత‌రిక్షం!

యంగ్ హీరోలంద‌రిలోకి వ‌రుణ్ తేజ్ ఇప్పుడు భీక‌ర ఫాంలో ఉన్నాడు. ఫిదా, తొలి ప్రేమ వంటి సినిమాల‌తో యూత్ లో త‌నకంటూ సెప‌రేట్ క్రేజ్ ఏర్ప‌ర‌చుకున్నాడు. మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ల‌కుండా వెరైటీ స‌బ్జ‌క్ట్స్ తో క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. తాజాగా వ‌రుణ్ న‌టించిన అంత‌రిక్షం సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫిక్ష‌న్, సైన్స్, స్పేస్, టెక్నాల‌జీ అంశాల చుట్టూ తిరిగే ఈ ట్రైల‌ర్ లో స‌గం సినిమాను చూపించేసింది చిత్ర యూనిట్. వ్యోమ‌గామిగా వ‌రుణ్ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉండ‌టంతో అభిమానులు ట్రైల‌ర్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. యూట్యూబ్ లో విడుద‌ల చేసిన కేవ‌లం 24 గంట‌ల్లోనే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌చ్చాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌రిక్షం ట్రైలర్ ను 3 మిలియ‌న్ల మంది చూడ‌గా… ల‌క్ష మంది లైక్ చేశారు. ఘాజీ సినిమా ద్వారా సబ్ మెరైన్ లోకంలోకి మ‌న‌ల్ని తీసుకెళ్లి స‌ముద్ర గ‌ర్భంలో యుద్దం ఎలా ఉంటుందో చూపించిన‌.. సంక‌ల్ప్ రెడ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.. వరుణ్ తేజ్ కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి న‌టించింది. మిగిలిన పాత్ర‌ల్లో అదితిరావ్ హైద‌రీ త‌దిత‌రులు న‌టించారు. డిసెంబ‌ర్ 21 ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus